జబర్దస్త్ చమ్మక్ చంద్ర తండ్రయ్యాడు... (ఫోటోస్)
చమ్మక్ చంద్ర దంపతులు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నటుడు ధన్ రాజ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో పాటు కొన్ని ఫోటోలు కూడా పోస్టు చేసారు.
హైదరాబాద్: 'జబర్దస్త్' ద్వారా పాపులర్ అయిన చమ్మక్ చంద్ర ప్రస్తుతం సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెతున్నాడు. చమ్మక్ చంద్రకు సోషల్ మీడియాలో అభిమానుల ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్న చమ్మక్ చంద్ర... తాజాగా తండ్రిగా ప్రమోషన్ పొందడంతో మరింత హ్యాపీగా ఉన్నారు. చమ్మక్ చంద్ర దంపతులు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నటుడు ధన్ రాజ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో పాటు కొన్ని ఫోటోలు కూడా పోస్టు చేసారు.

'కంగ్రాట్యులేషన్స్ చమ్మక్ చంద్ర. ఆ చిన్నారికి దేవుడి దీవెనలు. తండ్రివి అయినందుకు శుభాకాంక్షలు, సరస్వతీ దేవి పుట్టింది అని అనుకుంటున్నాను, యువర్ లిటిల్ ఏంజెల్ సూపర్బ్ అంటూ ధనరాజ్ విషెస్ తెలిపారు.


Click it and Unblock the Notifications











