ఎంఎస్ నారాయణ కూతురు కూడా ఆ దారిలో..?

ఆ మధ్య ఆయన దర్శకుడిగా ప్రయత్నించారు కానీ వర్కౌట్ కాలేదు. తాజాగా ఎమ్మెస్ నారాయణ కూతురు శశికిరణ్ దర్శకురాలిగా పరిచయం కాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్మెస్ మాదిరిగానే ఆమెలో కూడా రచయితకు కావాల్సిన స్కిల్స్ ఉన్నాయని, సొంతగా కథలు తయీరు చేసుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
'మా నాన్నకు పెళ్లి' చిత్రం ద్వారా నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టిన ఎమ్మెస్ నారాయణ తనదైన మ్యానరిజంతో, నటనతో కామెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తారా స్థాయికి దూసుకెళ్లారు. అయితే ఆయన నటుడిగా మారక ముందు రచయిత అనే విషయం అందరికీ తెలిసిందే. పలు సినిమాలకు ఆయన రచయితగా పని చేసిన మంచి పేరు తెచ్చుకున్నారు.
కమెడియన్‌గా బాగా సంపాదించిన తర్వాత తన తనయుడు విక్రమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'కొడుకు' సినిమా తెరకెక్కించిన ఎమ్మెస్...ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో తీవ్రంగా నష్టపోయాను. ఒకే సినిమాతో తనను తాను దర్శకుడిగా, కొడుకును హీరోగా నిరూపించుకుందామని చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో మళ్లీ ఆయన దర్శకత్వం వైపు చూడలేదు. దర్శకత్వ విభాగంలో నాన్న అందుకోలేని విజయాన్ని కూతురు అందుకుంటుందా? అనేది చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











