»   »  కమెడియన్ ఇంటిపై దాడి, చేసింది ఆ విలనే...

కమెడియన్ ఇంటిపై దాడి, చేసింది ఆ విలనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమాల్లో కమెడియన్‌గా చేస్తున్న డీవీ నాయుడు ఇంటిపై దాడి జరిగింది. 'నేనే రాజు నేనేమంత్రి' చిత్రంలో విలన్‌ పాత్ర పోషిస్తున్న రాము ఈ దాడికి పాల్పడినట్టు బాధితుడు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన అనుచరులతో వచ్చిన రాము దౌర్జన్యానికి పాల్పడ్డాడని, తన ఇంట్లో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రర్తించాడని వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు డివి నాయుడు పోలీసులు ఫిర్యాదు చేశారు.

 Comedian DV Naidu House Attaked

రాము మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు. వీరి మధ్య ఈ గొడవకు కారణం ఆర్థికపరమైన కారణాలే అని తెలుస్తోంది. పోలీసు విచారణలో మరిన్ని విషయాలు వెల్లడి కానున్నాయి.

తేజ దర్శకత్వంలో రానా, కాజల్‌ జంటగా 'నేనే రాజు - నేనే మంత్రి' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రాము విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Tollywood comedian DV Naidu was attacked on Wednesday by a man named Ramu, who is acting as a villain role in 'Nene Raju Nene Matri' movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X