పవన్ కల్యాణ్ నా దేవుడు.. ఎన్ని లక్షలిచ్చాడో తెలుసా? ఫిష్ వెంకట్ ఎమోషనల్ వీడియో..
Fish Venkat: టాలీవుడ్ నటుడు కమెడియన్ ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సినిమాలకు దూరం కావడంతో ఆర్థికంగా వెంకట్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వెంకట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. ఆర్థికంగా కొంత మొత్తాన్ని ఇచ్చి, అన్ని విధాల సహాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ విషయాన్ని వెంకట్ ఓ వీడియోలో వెల్లడించారు. ప్రస్తుతం వెంకట్ ఎమోషనల్ వీడియో వైరల్ గా మారింది.
ఫిష్ వెంకట్ తెలుగు సినిమాలలో కమెడియన్ గా, విలన్ గా నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో 'తొడగొట్టు చిన్నా' అనే డైలాగ్ తో పాపులర్ అయ్యారు. ఇలా వందల సినిమాలలో, పలువురి స్టార్ హీరోలతో నటించారు ఫిష్ వెంకట్. అయితే గత కొంతకాలంగా ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో సినిమాలకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి దయనీయంగా మారింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పిష్ వెంకట్ మాట్లాడుతూ .. తనకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, షుగర్, బిపి వంటి వ్యాధులతో తాను బాధపడుతున్నానని, సినిమాలు లేకపోవడంతో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్నానని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం తాను దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు అతని వ్యాధి తీవ్రంగా కావడంతో చికిత్స చేసుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు.
ఈ క్రమంలో చాలామంది నటులు తెలుసు గనుక.. ఈ కష్ట సమయంలో ఎవరినైనా సహాయం కోరుమని కుటుంబ సభ్యులు సూచించారని, తన భార్య సువర్ణ ఒత్తిడి మేరకు తాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు వెల్లడించారు.
నటుడు వెంకట్ మాట్లాడుతూ. పవన్ కళ్యాణ్ తనను ఎంతో ఆప్యాయంగా పలకరించారని, తన ఆరోగ్య సమస్యలను విని చెలించిపోయారని, అన్ని విధాలుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలియజేశారు. ఈ సమయంలో తన ఆర్థిక ఇబ్బందులను గమనించి, తన బ్యాంక్ ఖాతాలో వెంటనే రెండు లక్షల రూపాయలను జమ చేశారని వెంకట్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తనను ఈ కష్ట కాలంలో ఆదుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

'పవన్ కళ్యాణ్ నా దేవుడని , ఆయన కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్లు' ఫిష్ వెంకట్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై మెగా ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











