twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ హాస్య నటుడు మృతి.. దుర్భర జీవితం.. 400 సినిమాల్లో!

    |

    Recommended Video

    Gundu Hanumantha Rao Lost Life

    ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంత రావు(61) సోమవారం (ఫిబ్రవరి 19,2018) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. దశాబ్దాల కాలం పాటు ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు. గత కొంత కాలంగా హనుమంత రావు అనారోగ్యంతో భాదపడుతున్న సంగతి తెలిసిందే. హనుమంత రావు హాస్య నటుడిగా దాదాపు 400 పైగా చిత్రాల్లో నటించారు. యమలీల, పేకాట పాపారావు, ప్రేమ వంటి చిత్రాల్లో హనుమంత రావు నటించారు. ముఖ్యంగా 90 లలో ఆయన ఎక్కువ చిత్రాల్లో నటించారు.

    ఆ సినిమాలతో గుర్తింపు

    ఆ సినిమాలతో గుర్తింపు

    హనుమంత రావు 80 వ దశకంలోనే చిత్ర పరిశ్రమకు వచ్చారు. యమలీల, పేకాట పాపారావు, ఘటోత్కచుడు, రాజేంద్రుడు గజేంద్రుడు వంటి చిత్రాల ద్వారా హాస్య నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్నారు.

    అమృతంతో కొత్త ప్రయాణం

    అమృతంతో కొత్త ప్రయాణం

    సినీ అవకాశాలు తగ్గినకమ్రంలో ఆయన అమృతం సీరియల్ ద్వారా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అమృతం సీరియల్ బుల్లి తెరపై నవ్వులు పూయించింది.

    దుర్భర జీవితం.. అనారోగ్యం

    దుర్భర జీవితం.. అనారోగ్యం

    హనుమంత రావు కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో దుర్భర జీవితం గడుపుతున్నట్లు తెలుస్తోంది. అదే క్రమంలో ఆయన అనారోగ్యంతో భాదపడుతున్నారు.

    మెగాస్టార్ సాయం

    మెగాస్టార్ సాయం

    ఇటీవల హనుమంత రావు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి హనుమంత రావుకు ఆర్థిక సాయం అందించారు.

    తెల్లవారు జామన కన్నుమూత

    తెల్లవారు జామన కన్నుమూత

    ఈ తెల్లవారు జామున హనుమంత రావు మృతి చెందారు. దీనితో ఆయన తో నటించిన నటీనటులు, చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

    జన్మస్థలం విజయవాడ.. తొలి చిత్రం..

    జన్మస్థలం విజయవాడ.. తొలి చిత్రం..

    ముందు హనుమంత రావు 1956 అక్టోబర్ 10 న విజయవాడలో జన్మించారు. నాటకాలపై ఆసక్తితో ఆయన 18 ఏళ్ల వయస్సులోనే నాటక రంగం ప్రవేశం చేశారు. ఓ నాటకంలో దర్శకులు జంధ్యాల గుండు హనుమంత రావు నటనకు మెచ్చి ఆయనకు అహనా పెళ్లంట చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆహనాపెళ్ళంట చిత్రం ఆల్ టైం కామెడీ ఎంటర్ టైనర్ గా నిలిచిన సంగతి తెలిసింది. ఆ తరువాత వరుసగా హనుమంత రావుని అవకాశాలు పలకరించాయి.

    English summary
    Comedian Gundu Hanumantha Rao is no more. He died at the age 61 due to health problems.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X