హాస్యనటుడు గుండు హనుమంతరావుకు భార్య వియోగం
హాస్యనటుడు గుండు హనుమంతరావు సతీమణి శ్రీమతి ఝాన్సి రాణి(45) ఆదివారం ఉదయం 6గం 30నిమిషాలకు అనారోగ్యంతో కన్నుమూసారు. బాత్ రూంలో కాలుజారి పడటం వల్ల మెదడులో రక్తం గట్టకట్టడంతో ఆమె మూడు నెలలుగా కోమాలోనే వున్నారు. ఈ మృతి పట్ల పలువురు చిత్ర ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేసారు. చాలామంది ఆయన ఇంటికి వెళ్ళి చూసి వచ్చారు. ఇక గుండు హనుమంతురావు...గత కొంత కాలంగా సినిమాలు తగ్గించుకుని ఆమెకు సపర్యలు చేస్తూ వస్తున్నారు. ధట్స్ తెలుగు కూడా ఆమె మరణానికి సంతాపం తెలియచేస్తోంది.
టాలీవుడ్ గుండు హనుమంతురావు ఝాన్సీ రాణి మావిచిగురు శుభలగ్నం అమృతం రాజేంద్రుడు గజేంద్రుడు gundu hanumantha rao jhansi rani mavichiguru subhalagnam rajendrudu ghajendrudu


Click it and Unblock the Notifications