Don't Miss!
- News Telangana Loksabha Polls 2024:కేసీఆర్ కుటుంబాన్ని ఆ భయం వెంటాడుతోందా....!!
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రక్కన ఉన్నది టెర్రరిస్టులేమో..కృష్ణ భగవాన్
ఇప్పుడు పక్క పోర్షన్ లో ఉంది టెర్రరిస్టులో, ఉగ్రవాదులో తెలీని పరిస్థితుల్లో ఉన్నాం అంటూ సినీ హాస్య నటుడు కృష్ణభగవాన్ ప్రస్తుతం పరిస్ధుతలపై వ్యాఖ్యానించారు. సంక్రాంతి పండుగ గురించి తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ..నాకు చిన్నప్పుడు వచ్చిన ప్రతి పండుగ ఆనందంగా ఉండేది. పెద్దయిన తర్వాత పండుగను మానసికంగా మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాను. అందులోనూ మాది పల్లెటూరు కావడంతో మా పండుగ అంతా అక్కడే ఉండేది. కత్తులు కోళ్లకు కట్టేవారు కానీ, మనుషులు పట్టుకునే వారు కాదు. ప్రతి సంవత్సరం అన్ని మతాల పండుగలు చేసుకుంటాను. ప్రేయసికోసం ఎదురు చూసినట్టు దీపావళి కోసం ఎదురు చూసేవాణ్ని.చిన్నప్పుడు...కొత్త బట్టలు వేసుకోవడం, గోళీలాటలు...మరచిపోలేనివి. ఇప్పుడీ సంక్రాంతి...వచ్చినట్టే వచ్చి వెళ్లిపోతుంటే మాత్రం చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు హరిదాసు లేడు, గంగిరెద్దులు లేవు, సంప్రదాయం క్రమేణా కరువైపోతోంది..అన్నారు.సంక్రాంతికి రిలీజైన శంభో శివ శంభో చిత్రంలో ఆయన పబ్లిసిటీ పిచ్చి ఉన్న రాజకీయనాయకుడుగా కనిపించి ప్రశంసలు పొందుతున్నారు.