కమిడియన్ ఎమ్ ఎస్ నారాయణకు అసభ్యకర కాల్స్
ప్రముఖ హాస్య నటుడు ఎమ్ ఎస్ నారాయణ కుటుంబం గత ఇరవై రోజులుగా బూతులుతో కూడిన కొన్ని ఫోన్ కాల్స్ తో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఫోన్ ఎత్తకపోతే చెత్త ఎస్.ఎమ్.ఎస్ లతో విసిగించేవాడు. దాంతో ఆయన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసారు. దాంతో వైజాగ్ కి చెందిన రవికుమార్(26) వ్యక్తిని పోలీసులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి దాదాపు పది సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్ లను మార్చి మార్చి వాడుతూ అతని ఫోన్స్,ఎస్.ఎమ్.ఎస్ లు ఇచ్చేవాడు. అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చే ఇంటరాగేట్ చేసారు. విచారణలో మరికొంత మంది సినీ ప్రముఖుల ఫోన్ నెంబర్లు సంపాదించి అతను ఇలా ఇబ్బంది పెట్టినట్లు తేలిందని చెప్తున్నారు. పోలీసులు వేగవంతంగా ధర్యాప్తు చేసి మానసిక క్షోభ నుంచి తప్పించినందుకు ఎమ్ ఎస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
వైజాగ్ హాస్య నటుడు రవికుమార్ సిమ్ కార్డులు ఎస్ ఎమ్ ఎస్ ఎమ్ ఎస్ నారాయణ ms narayana vizag comedian threatening calls sim cards sms


Click it and Unblock the Notifications