డైరెక్టర్‌గా మారుతున్న నల్ల వేణు.. ప్రముఖ బ్యానర్‌లో కమెడియన్ మూవీ

టాలీవుడ్‌లో ప్రత్యేకమైన హావభావాలతో, సహజమైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న కమెడియన్లలో నల్ల వేణు ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే ఎన్నో భిన్నమైన పాత్రలతో మెప్పించిన ఈ క్రేజీ కమెడియన్ తన కెరీర్‌లో ప్రస్తుతం మరో పాత్రలోకి ఒదిగిపోనున్నారు. నటుడిగా మెప్పించిన ఈ హాస్య నటుడు త్వరలోనే డైరెక్టర్‌గా మారబోతున్నారు. ఆ వివారాల్లోకి వెళితే...

శృతి హాసన్.. గ్లామర్ ప్రజెంటేషన్ లో ఆల్ రౌండర్

చిత్రం శ్రీనుకు అసిస్టెంట్‌గా

చిత్రం శ్రీనుకు అసిస్టెంట్‌గా

నల్ల వేణు కెరీర్ విషయానికి వస్తే.. చిత్రం శ్రీనుకు అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అలా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయనలోని కామెడీ యాంగిల్‌ను గమనించిన సినీ దర్శకులు పలు అవకాశాలు ఇచ్చారు. దాంతో నల్ల వేణు కమెడియన్‌గా మారారు. అప్పటి నుంచి వైవిధ్యమైన హాస్య పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు.

దశాబ్ద కాలంగా కమెడియన్‌గా

దశాబ్ద కాలంగా కమెడియన్‌గా

కమెడియన్‌గా మారిన వేణు గత దశాబ్ద కాలంగా హాస్య నటుడిగా వందకుపైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా జగడం మూవీతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత విలన్లకు అసిస్టెంట్‌గా, హీరోలకు స్నేహితుడి పాత్రతో మెప్పిస్తూ వస్తున్నారు. అయితే చాలా మంది కమెడియన్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ను చేజిక్కించుకొంటే.. నల్ల వేణు మాత్రం రూట్ మార్చారు.

డైరెక్టర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకోబోతూ...

డైరెక్టర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకోబోతూ...

తాజాగా నల్ల వేణు తన కెరీర్‌లో మరో అడుగు ముందు వేసేందుకు సిద్ధమయ్యారు. తనలోనే ప్రతిభను బయటపెట్టేందుకు నల్ల వేణు దర్శకుడిగా మారబోతున్నారు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు శరవేగంగా జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.

Recommended Video

#SathyamevaJayathe From Vakeel Saab is out | Filmibeat telugu
ప్రముఖ నిర్మాత మూవీతో

ప్రముఖ నిర్మాత మూవీతో

ఇక నల్ల వేణు ఇటీవల ప్రముఖ నిర్మాతను కలిసి తన స్క్రిప్టును వినిపించారు. ఆ స్క్రిప్టు విన్న వెంటనే నిర్మాత సానుకూలంగా స్పందించడంతో దర్శకుడి పాత్రను పోషించడానికి లైన్ క్లియర్ అయిందని సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌లో నల్ల వేణుకు డైరెక్టర్‌గా అవకాశం రావడంపై సన్నిహితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X