ప్రముఖ కమెడియన్ నర్సింగ్ యాదవ్ కన్నుమూత.. వర్మ చిత్రాలతో గుర్తింపు..

దశాబ్ద కాలంగా ప్రేకకులను తనదైన హాస్యంతో ఆకట్టుకొన్న టాలీవుడ్ కమెడియన్ నర్సింగ్ యాదవ్ ఇక లేరు. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. ఆయన మృతితో తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నర్సింగ్ యాదవ్ మృతిపై అభిమానులు, సన్నిహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

లాక్‌డౌన్ సమయంలో అస్వస్థతకు గురై

లాక్‌డౌన్ సమయంలో అస్వస్థతకు గురై

లాక్‌డౌన్ సమయంలో నర్సింగ్ యాదవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఓ దశలో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నర్సింగ్ యాదవ్‌ను హస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందించడంతో ఆయన కోలుకొన్నారు. కానీ కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తిరగదోడటంతో ఆయన హాస్పిటల్‌కు తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మరణించారని సన్నిహితులు తెలిపారు.

మూత్ర పిండాల వ్యాధితో

మూత్ర పిండాల వ్యాధితో

నర్సింగ్ యాదవ్ కొంతకాలంగా మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు క్రమం తప్పకుండా డయాలిసిస్ చికిత్స చేయిస్తున్నారు. ఏప్రిల్‌లో ఆయన తీవ్ర అస్వస్థతకు గురై కోమాలకు వెళ్లారు. ఆ సమయంలో ఆయనను హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో చికిత్స అందించారు. తాజాగా మరోసారి అస్వస్థతకు గురి కావడం మళ్లీ యశోదాకు తరలించి చికిత్స అందించాం అని సన్నిహితులు తెలిపారు.

కొద్ది నెలల క్రితం రూమర్లు

కొద్ది నెలల క్రితం రూమర్లు

కొద్ది నెలల క్రితం నర్సింగ్ యాదవ్ ఆరోగ్యంపై అనేక రూమర్లు వచ్చాయి. అయితే ఆ వార్తలను నర్సింగ్ యాదవ్ భార్య, కుటుంబ సభ్యులు ఖండించారు. తన భర్త అనారోగ్యం కారణంగా ఉన్నట్లు ఉండి కోమాలోకి వెళ్ళిపోయాడు. త్వరగా కోలుకుని తను ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎవరు నమ్మకండి. నర్సింగ్ యాదవ్ క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకోవాలి అని చిత్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన కోలుకొన్నట్టే కోలుకొన్న నర్సింగ్ యాదవ్ డిసెంబర్ 31 యశోద హాస్పిటల్‌లో మృతి చెందారు.

నర్సింగ్ యాదవ్ వ్యక్తిగత జీవితం

నర్సింగ్ యాదవ్ వ్యక్తిగత జీవితం

1963 మే 15న హైద‌రాబాద్‌లో జన్మించారు. ఆయ‌న‌కు భార్య చిత్ర‌, కొడుకు రిత్విక్ యాద‌వ్‌ ఉన్నారు. తన కెరీర్‌లో తెలుగు, హిందీ, త‌మిళ్‌ భాషల్లో ఇప్పటి వరకు 300ల‌కు పైగా సినిమాల్లో న‌టించి కామెడీ విల‌న్‌గా, విల‌క్ష‌ణ న‌టుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. న‌టించారు. ర‌జ‌నీకాంత్ న‌టించిన బాషా ,చిత్రంలో కీలక పాత్రను పోషించారు.

Recommended Video

Mega Star Chiranjeevi About Talasani Seva Trust
నర్సింగ్ యాదవ్ పలు భాషల్లో

నర్సింగ్ యాదవ్ పలు భాషల్లో

స్వర్గీయ విజయనిర్మల దర్శకత్వం వహించిన హేమాహేమీలు చిత్రం ద్వారా చిత్ర సీమలోకి ప్రవేశించిన నర్సింగ్ యాదవ్.. అనతి కాలంలోనే మంచి పేరును సంపాదించుకొన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు వంద చిత్రాల్లో నటించారు. రాంగోపాల్ వర్మ రూపొందించిన క్షణక్షణం, మనీ, మనీ మనీ లాంటి చిత్రాల్లో మంచి ప్రేక్షకాదరణను సంపాదించుకొన్నారు. చిరంజీవి నటించిన టాగోర్, మహేష్ బాబు పోకిరి చిత్రాలు ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి.

ప్రత్యేకమైన డైలాగ్ డెలీవరి సొంతం

ప్రత్యేకమైన డైలాగ్ డెలీవరి సొంతం

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన పలు చిత్రాల్లోనే కాకుండా ఇతర చిత్రాల్లో కూడా నర్సింగ్ యాదవ్ తనదైన నటనను ప్రదర్శించారు. ఆయన డైలాగ్ డెలీవరికి ఓ ప్రత్యేకత ఉంటుందనేది తెలుగు ప్రేక్షకుల అభిప్రాయం. అనారోగ్య కారణాల వల్ల ఆయన కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

నర్సింగ్ యాదవ్ నటించిన చిత్రాలు

నర్సింగ్ యాదవ్ నటించిన చిత్రాలు

నర్సింగ్ యాదవ్ క్ష‌ణ‌క్ష‌ణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్‌, శంక‌ర్ దాదా ఎంబీబీయ‌స్‌, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్ల‌జ‌మీందార్‌, సుడిగాడు, కిక్‌ త‌దిత‌ర చిత్రాల్లో ఆయ‌న నటించిన పాత్రలకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీనెంబ‌ర్ 150లోనూ న‌టించి మెప్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X