For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రీహరి క్యారెక్టర్‌ను బయటపెట్టిన పృథ్వీ: ఇంటికి వెళ్లిన వాళ్లకు అలా చేసేవాడంటూ ఎమోషనల్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోగా మారి.. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన నటుడు శ్రీహరి. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో గొప్ప గొప్ప పాత్రలను పోషించిన ఆయన.. చాలా కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించారు. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే శ్రీహరి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన క్యారెక్టర్‌ గురించి ప్రముఖ కమెడియన్ పృథ్వీ రాజ్ ఓ షోలో కీలక వ్యాఖ్యలు చేశారు. తద్వారా అవన్నీ గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాలు మీకోసం!

  అలా పరిచయం.. ఎన్నో విధాలుగా

  అలా పరిచయం.. ఎన్నో విధాలుగా

  1987లో వచ్చిన ‘బ్రహ్మనాయుడు' అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టారు శ్రీహరి. అప్పటి నుంచి దాదాపు పాతికేళ్ల పాటు విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇలా సుదీర్ఘ కాలం పాటు సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగించిన ఆయన.. ఎన్నో మైలురాళ్లను కూడా చేరుకుని సత్తా చాటారు.

  ఆమెతో వివాహం.. అకాల మరణం

  ఆమెతో వివాహం.. అకాల మరణం

  శ్రీహరి ప్రముఖ నటి, డ్యాన్సర్ డిస్కో శాంతిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరికీ ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు. అందులో పాప చిన్న వయసులోనే చనిపోయింది. ఇక, వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీహరి 2013లో లివర్‌కు సంబంధించిన వ్యాధితో మరణించారు. సుదీర్ఘ కెరీర్‌లో ఆయన ఎంతో మందికి సహాయం కూడా చేశారు.

   శ్రీహరితో పృథ్వీ రాజ్ అనుబంధం

  శ్రీహరితో పృథ్వీ రాజ్ అనుబంధం

  చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు విలక్షణ నటుడు పృథ్వీ రాజ్. అప్పట్లో అన్ని రకాల పాత్రలను పోషించిన ఆయన.. కొంత కాలంగా హాస్య ప్రధానమైన రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఖడ్గం' సినిమాలో ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ' అంటూ చెప్పిన డైలాగ్‌తో ఫుల్ పాపులర్ అయ్యారు. ఈయనకు శ్రీహరికి మధ్య సన్నిహిత సంబంధం ఉంది. ఈ విషయం ఆయనే చెప్పారు.

  The Family Man 2 Review | Samantha, Screenplay రెండూ సూపర్ !! || Filmibeat Telugu
  సుమ క్యాష్‌ షోలో శ్రీహరి ప్రస్తావన

  సుమ క్యాష్‌ షోలో శ్రీహరి ప్రస్తావన

  తెలుగులో సెలెబ్రిటీలతో నడిచే షోలలో క్యాష్ ఒకటి. సుమ కనకాల హోస్టు చేస్తున్న దీనికి ప్రతి వారం సినీ, బుల్లితెరకు చెందిన ప్రముఖులు వస్తుంటారు. ఈ క్రమంలోనే వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సినీ పరిశ్రమ నుంచి కమెడియన్ పృథ్వీ రాజ్, సుదర్శనం, జ్యోతి, బెనర్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా లెజెండరీ యాక్టర్ శ్రీహరి గురించి ఈ కార్యక్రమంలోనే ప్రస్తావించారు.

  శ్రీహరి క్యారెక్టర్‌పై పృథ్వీ కామెంట్స్

  శ్రీహరి క్యారెక్టర్‌పై పృథ్వీ కామెంట్స్

  క్యాష్ షో వచ్చే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో మొత్తం ఫన్నీగా సాగిన అంశాలను చూపించారు. యాంకర్ సుమ అందరిపై పంచులు వేయగా.. వాళ్లు కూడా ఆమెకు గట్టిగానే సెటైర్లు వేశారు. అందరూ తమదైన శైలిలో కామెడీని పండించారు. ఇక, ఈ ప్రోమో చివర్లో కమెడియన్ పృథ్వీ రాజ్.. శ్రీహరి క్యారెక్టర్ గురించి వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు.

  రాళ్లను చుట్టేసి విసిరేసేవాడంటూ

  రాళ్లను చుట్టేసి విసిరేసేవాడంటూ

  క్యాష్ షోలో శ్రీహరి ఫొటో చూపించగానే.. పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. ‘రోడ్ నెంబర్ 45లో ఉన్న శ్రీహరి గారి ఇంటి ముందుకు ఎవరైనా వెళ్తే.. రాళ్లకు డబ్బులు చుట్టి.. దానికి గుడ్డ కట్టి బయటకు విసిరేసేవాడు. వాటిని తీసుకున్న వాళ్లు ఆయనకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టేవారు. ఇలా శ్రీహరి గారు కొన్ని వేల మందికి సహాయం చేశారు' అంటూ ఆయన గొప్పదనాన్ని వివరించారు.

  క్యాష్ షోలో పృథ్వీ రాజ్ డైలాగ్

  క్యాష్ షోలో పృథ్వీ రాజ్ డైలాగ్

  కమెడియన్ పృథ్వీ రాజ్‌కు ‘ఖడ్గం' సినిమా ఎంతో పేరును తెచ్చి పెట్టిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో హీరోగా చేస్తున్న ఆయన డైలాగ్ చెప్పకపోతే.. జూనియర్ ఆర్టిస్టు అయిన రవితేజ దాన్ని సింగిల్ టేక్‌లో ఫినీష్ చేస్తాడు. ఇప్పుడా డైలాగునే క్యాష్ షోలో చెప్పాడు పృథ్వీ రాజ్. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆయనకు చప్పట్లు కొట్టి అభినందించారు.

  English summary
  Comedian Prudhvi Raj Recently Participated in Suma Kanakala's Cash Show. He Comments on Srihari Charactor in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X