For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆడది 15మందితోనైనా.., మూడ్ వచ్చినోడే అలా.. ఎయిడ్స్ అన్నారు: నవీనపై భగ్గుమన్న పృథ్వి

  |

  సోషల్ మీడియా పరిధి విస్తరించిన తర్వాత ప్రజా ఉద్యమాలకు ఎంత మేలు జరిగిందో.. చీప్ పబ్లిసిటీకి దాన్నో అడ్డాగా మలుచుకుంటున్నవారి సంఖ్య కూడా పెరిగింది.

  కేవలం వ్యూస్ కోసం, క్లిక్స్ కోసం అడ్డదారులు తొక్కుతున్న సైట్లకు, యూట్యూబ్ చానెల్స్‌కు ఇప్పుడు కొదవలేదు. సంచలనం కోసమో.. వార్తల్లో నిలవడం కోసమో.. లేక యూట్యూబ్ ద్వారా ఇన్‌కమ్ కోసమో.. మొత్తానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కానీ కంటెంట్‌ను ఇంటర్నెట్ లోకి ఎక్కించేస్తున్నారు.

  మరీ ముఖ్యంగా.. సినీ తారలను లక్ష్యంగా చేసుకుని కొన్ని యూట్యూబ్ చానెల్స్ అడ్డమైన చెత్తను ప్రసారం చేస్తుంటే.. మరికొన్ని చానెల్స్ పనిగట్టుకుని కొంతమంది ఆర్టిస్టుల రహస్య జీవితాలను వెలికితీసే పనిలో పడ్డాయి. సహజంగానే 'సెక్స్' కంటెంట్‌కు ఉండే రేటింగ్ రీత్యా అవి కాస్త వైరల్‌గా మారతున్నాయి.

  ఈ నేపథ్యంలో తన దృష్టికి వచ్చిన ఓ యూట్యూబ్ వీడియోపై కమెడియన్ పృథ్వి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఏంటా వీడియో?.. ఆయనెందుకంత ఫైర్ అయ్యారు..

   'ఎటుపోతోంది మ‌న సంస్కృతి':

  'ఎటుపోతోంది మ‌న సంస్కృతి':

  టీవి ఆర్టిస్ట్ నవీనా జీవితానికి సంబంధించి యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. కారణం.. అందులో ఉన్న అసభ్యకర విషయాలే తప్ప మరొకటి కాదు. ఈ వీడియోపై తాజాగా పృథ్వి స్పందించారు. వీడియో లింకును తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఆయన.. 'ఎటుపోతోంది మ‌న సంస్కృతి. ఇలా మాట్లాడితే స‌మాజంలో న‌టుల‌కు విలువ ఎలా ఉంటుంది. ఆలోచించండి' అని కామెంట్ చేశారు.

  ఆడది తలుచుకుంటే 15మందితోనైనా!:

  ఆడది తలుచుకుంటే 15మందితోనైనా!:

  ఇండస్ట్రీలో ఉన్నవాళ్లంటేనే.. అదో రకంగా చూసే చెడ్డ కల్చర్ ఉందని ఓవైపు చెబుతూనే.. నవీనా తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 'ఒక ఆడది తలుచుకుంటే.. ఎంతోమందితోనైనా పడుకోగలదు.. సంసారం చేయగలదు.. మగవాడికి అంత శక్తి లేదు.' అంటూ ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.

   మూడ్ వస్తేనే నొక్కుతారు:

  మూడ్ వస్తేనే నొక్కుతారు:

  చాలామంది మగవాళ్లు ఆడవాళ్ల పట్ల ప్రేమ నటిస్తారేమో అన్నట్లుగా నవీనా కామెంట్స్ చేశారు. గుడికి వెళ్లి అక్కడ దేవతకు దండం పెడుతారు.. అన్నీ చేస్తారు కానీ ఇంట్లో ఉండే పెళ్లాన్ని మాత్రం గౌరవించరని అన్నారు. ఇంతలో యాంకర్ కలగజేసుకుని భార్యల కాళ్లు పట్టేవాళ్లు కూడా ఉన్నారని ఏదో చెప్పబోతుంటే.. 'మూడ్ వచ్చినోడు నొక్కుతాడేమో' అని ఆమె కామెంట్ చేశారు.

   యాంకర్ కూడా అలాగే:

  యాంకర్ కూడా అలాగే:

  నవీనా ఇంటర్వ్యూ చూసినవాళ్లెవరికైనా ఇదో రకమైన జుగుప్స అనిపించకమానదు. ప్రీ-ప్లాన్డ్‌గా ఇలాంటి సబ్జెక్టును మాట్లాడటం కోసమే ఈ ఇంటర్వ్యూ చేసినట్లు అనిపిస్తుంది. నవీనా డార్క్ లైఫ్ గురించి లాగాలని యాంకర్ ప్రయత్నించడం.. తననెవరూ ట్రాక్ ఎక్కించలేదని ఆమె వ్యాఖ్యానించడం వంటివి అసభ్యకరంగా అనిపించే అంశాలు.

   బూతులా మార్చేశారు?:

  బూతులా మార్చేశారు?:

  నవీనా జీవితంలో ఎన్నో చీకటి కోణాలు ఉండవచ్చు. ఆమె వరకు అవి ఆవేదనా భరితమైనవి కావచ్చు. కానీ ఇంటర్వ్యూలో ఆమె తన గురించి చెప్పిన విధానం.. ఆ యాంకర్ వెకిలి నవ్వులు.. అన్నీ కలిసి ఈ వీడియోను ఒక బూతు లాగా మార్చేశాయి. సహజంగానే బూతు కంటెంట్ త్వరగా వైరల్ అవుతుంది కాబట్టి యూట్యూబ్‌లో ఇప్పుడీ వీడియో పది లక్షల పైచిలుకు వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది.

  'అసభ్య టైటిల్స్'తో:

  'అసభ్య టైటిల్స్'తో:

  నవీనా ఇంటర్వ్యూను మొత్తం మూడు నుంచి నాలుగు పార్టులుగా విభజించి యూట్యూబ్ లో పోస్టు చేశారు. ఆ వీడియోలకు పెట్టిన టైటిల్సే తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. 'కొడుకు వయసు ఉన్నవాడు తల్లిని చేశాడు'.., 'ఒక ఆడది 15మందితో పడుకోగలదు'.., ' ఇండస్ట్రీలో పడుకుంటే ఓ రేటు.. పడుకోకపోతే ఓ రేటు' అన్న టైటిల్స్ తగిలించి యూట్యూబ్ లో పోస్టు చేశారు.

   ఆ వ్యాఖ్యలు విడ్డూరమే:

  ఆ వ్యాఖ్యలు విడ్డూరమే:

  ఇంత అసభ్యకరమైన రీతిలో సాగిన ఈ ఇంటర్వ్యూను నవీనా బాగానే సమర్థించుకున్నారు. తనకు దాచుకోవాల్సిన అవసరమేమి లేదని, ఈ ఇంటర్వ్యూ ఇంటర్నెట్ లోకి ఎక్కితే.. రేప్పొద్దున తన పిల్లలు కూడా చూస్తారని ఆమె ఏ ఉద్దేశంతో అన్నారో ఇప్పటికీ అర్థం కాలేదు.

   లవ్ ట్రాక్స్..:

  లవ్ ట్రాక్స్..:

  ఇంటర్వ్యూ మొత్తాన్ని గమనిస్తే.. నవీనా జీవితంలో చాలానే ఎత్తుపళ్లాలు ఉన్నట్లు గమనించవచ్చు. కానీ ఈ ఇంటర్వ్యూ జరిగిన కోణం.. దీని పబ్లిసిటీని బట్టి చూస్తే మాత్రం ఈ వీడియోపై చాలామంది విరుచుకుపడటం ఖాయం.

  చిన్నతనంలోనే పెళ్లి పేరుతో మోసపోయిన నవీనా.. ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తులతో తాను ప్రేమలో పడిన విషయాల గురించి చెప్పారు. అందరూ తనను మోసం చేసినట్లు చెప్పుకొచ్చారు. నాటక రంగం నుంచి మొదలైన తన ప్రస్థానంలో 'లవ్ ట్రాక్స్' గురించి ప్రస్తావిస్తూ చెప్పిన కొన్ని విషయాలు అభ్యంతరకరంగా ఉన్నాయి.

  నవీనా నేపథ్యం:

  నవీనా నేపథ్యం:

  తన అసలు పేరు నవీనా కాదని మెహబూబా చాంద్ అని ఆమె చెప్పారు. కానీ నాటకాల్లోకి ప్రవేశించాక పేరు మార్చుకున్నట్లు తెలిపారు. తొలుత తనకు ఉర్దూ తప్ప తెలుగు రాకపోయేదని, క్రమంగా తెలుగు నాటకాల వైపు ఆకర్షితమై.. భాష నేర్చుకున్నట్లు తెలిపారు. ఆ క్రమంలో గురువుతోనే అక్రమ సంబంధం అంటగట్టారని, తప్పనిసరి పరిస్థితుల్లో అతన్నే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందన్నారు.

   రెండో పెళ్లి:

  రెండో పెళ్లి:

  తన మొదటి భర్తతో వైవాహిక జీవితం సరిగా సాగనందువల్ల.. అక్కడినుంచి హైదరాబాద్ వచ్చి టీవి ఆర్టిస్టుగా ప్రయత్నించినట్లు తెలిపారు. అలా కొన్ని అవకాశాలు దక్కించుకుని.. ఈటీవిలోను సీరియల్స్ చేస్తున్న సమయంలో ఒక అబ్బాయి తనను ప్రేమించడం.. తానూ ప్రేమించడం పెళ్లి దాకా వెళ్లడం జరిగాయన్నారు. కానీ భర్తతో విభేదాల కారణంగా అతనితోనూ విడిపోవాల్సి వచ్చిందన్నారు.

  తనకు ఎయిడ్స్ అన్నారు:

  తనకు ఎయిడ్స్ అన్నారు:

  ఈటీవిలో రెండు, మూడు సీరియల్స్ చేస్తున్న సమయంలో అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని.. దాంతో సీరియల్స్ మధ్యలోనే మానేశానని నవీనా అన్నారు. అయితే తన పెళ్లి విషయంపై ఈటీవి యాజమాన్యానికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో తనపై చాలా దుష్ప్రచారం జరిగిందన్నారు.

  నవీనా యాసిడ్ దాడిలో చనిపోయిందని కొందరు, ఎయిడ్స్ వచ్చి చనిపోయిందని మరికొందరు.. కాదు యాక్సిడెంట్ అని ఇంకొందరు.. ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు తన గురించి మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు.

  English summary
  Artist Naveena's interview gone viral in Youtube, Comedian Prudhvi recently shared that and criticised.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X