For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫర్ లేదు.. తప్పించలేదు.. ఎందుకు అలా రాస్తారో.. పవన్ కల్యాణ్ ఎఫెక్ట్‌పై పృథ్వీ

|
Comedian Prudhvi Clarifies Rumours On His Role In AA19 | Allu Arjun | Trivikram || Filmibeat Telugu

టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో తనదైన హాస్యాన్ని పండిస్తూ ఆకట్టుకొంటున్న స్టార్ కమెడియన్ పృథ్వీ. ఆయనను ముద్దుగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని పిలుచుకొంటారు. గత కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలిపి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజకీయాలకు విరామం చెప్పి సినిమాలపై దృష్టిపెట్టారు పృథ్వీ. అయితే తాజాగా పృథ్వీ గురించి ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఆ వార్త ఏమిటంటే..

AA19 మూవీలో నుంచి

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా జరుగుతున్నది. ఆ సినిమాకు వర్కింగ్ టైటిల్‌గా AA19 అని పిలుస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి పృథ్వీని తప్పించినట్టు ఓ వార్త ప్రచారం అవుతున్నది. ప్రచారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించినందుకే సినిమా నుంచి తప్పించినట్టు కథనాలు వెలువడుతున్నాయి.

మెగా హీరోలందరూ తీర్మానం?

అంతేకాకుండా వైఎస్ జగన్ విజయం సాధించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవిపై పృథ్వీ కూడా కామెంట్లు చేశారు. అందుకే మెగా క్యాంపు సీరియస్ అయింది. పవన్, చిరంజీవిపై పృథ్వీ చేసిన విమర్శలను అల్లు అర్జున్ తీవ్రంగా పరిగణించారు. అల్లు అర్జున్ సూచన మేరకు పృథ్వీని మరో యాక్టర్‌తో భర్తీ చేశారు. డజన్‌కు పైగా ఉన్న మెగా హీరోలు కూడా తమ చిత్రాల్లో పృథ్వీని తీసుకోకూడదు అని తీర్మానించుకొన్నారనే వార్త వెలుగు చూసింది.

పృథ్వీ క్లారిటీతో

AA19 సినిమా నుంచి తప్పించారనే విషయంపై పృథ్వీ ఫిల్మీబీట్‌తో స్పందిస్తూ.. ఆ సినిమాలో నాకు పాత్ర ఉన్నది. నాకు ఆఫర్ చేసిన సంగతి నాకు తెలియదు. అలాంటిది నన్ను ఆ సినిమా నుంచి తీసేశారని రాయడం సరికాదు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు రాయడం సరికాదు. మెగా ఫ్యామిలీ అంటే నాకు ఎప్పటికి గౌరవం ఉంటుంది. రాజకీయ పరంగా ఎవరి అభిప్రాయాలు వారివే. అంతేగానీ సినీ రంగానికి వాటిని అపాదించకూడదు. ముఖ్యంగా కళాకారులకు ఇలాంటి పరిమితులు ఉండకూడదు అని పృథ్వీ అన్నారు.

త్రివిక్రమ్‌ను కలువలేదని

అత్తారింటికి దారేది తర్వాత నేను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కలిసిన దాఖలాలు లేవు. ఆయన ఈ సినిమాలో వేషం ఇస్తానని కూడా చెప్పలేదు. నా గురించి మీడియాలో వస్తున్న వార్త అవాస్తవం. అందులో నిజం లేదు. AA19 సినిమాలో నాకు ఎలాంటి పాత్రను ఆఫర్ చేయలేదని మరోసారి స్పష్టం చేస్తున్నాను అని పృథ్వీ పేర్కొన్నారు.

English summary
Comedian Prudhvi who had a key character in Trivikram's upcoming film with Allu Arjun has been out from the project. But Prudhvi given clarity on project. He said, I do not know, whether they offered me a role. But I am not in AA19 and not out of the project too.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more