ప్యాకేజీ డబ్బే పవన్ కల్యాణ్‌కు.. వరుణ్ తేజ్, నాగబాబుపై పృథ్వీ సెన్సేషనల్ కామెంట్స్
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల హంగామా మొదలైన తర్వాత కొందరు సినీ సెలెబ్రిటీలు కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కమెడియన్ పృథ్వి వైసిపి తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక మెగా బ్రదర్ నాగబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్దత్తునిస్తున్నారు. సోషల్ మీడియాలో వరుస వీడియోలో రిలీజ్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్యన నాగబాబు ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ పృథ్విని ఉద్దేశిస్తూ..' అరేయ్ పృథ్వి నాకు ఫోన్ చేయి' అని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వివాదం గురించి పృథ్వి తాజాగా స్పందించారు.

ప్యాకేజి రూపంలో
కొన్ని నెలల క్రితం మెగా బ్రదర్ నాగబాబు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్ జనసేన పార్టీకి రూ 1.25 కోట్లు విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. తన రెమ్యునరేషన్ గా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని జనసేనకు విరాళంగా అందించారు. దీనికి పవన్ ట్విట్టర్ వేదికగా నాగబాబు, వరుణ్ తేజ్ కు కృతజ్ఞతలు కూడా తెలిపాడు. దీనిపై పృథ్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అంటూ వార్తలు వచ్చాయి.ఎక్కడి నుంచో ప్యాకేజి రూపంలో వచ్చిన డబ్బునే వరుణ్ తేజ్ ద్వారా జనసేనకు అందించారని పృథ్వి అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

నాగబాబు ఘాటుగా
ఈ ఆరోపణల గురించి ఓ ఇంటర్వ్యూలో నాగబాబుకు యాంకర్ తెలియజేశారు. నిజంగానే పృథ్వి ఆ మాటలు అన్నాడా.. అరేయ్ పృథ్వి నాకు ఒకసారి ఫోన్ చేయి అంటూ వార్నింగ్ ఇచ్చారు. నేను నీకే సమాధానం చెబుతా.. నా నంబర్ నీ దగ్గర ఉంది ఫోన్ చేయి అని ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని పృథ్వి అన్నారు. నాగబాబు అంత ఆవేశంగా ఎందుకు స్పందించారో నాకు అర్థం కావడం లేదని పృథ్వి తెలిపాడు.

టీ తాగుతూ చూశా
ఆ సమయంలో తాను రాయదుర్గంలో వివాహానికి హాజరై తిరిగివస్తుండగా కర్నూలులో వైసిపి కార్యకర్తలు నా కారుని ఆపారు. టీ తాగి వెళ్లాలని కోరారు. టీ తాగుతూ ఉండగా నాగబాబు న గురించిన చేసిన వ్యాఖ్యలు టీవీలో రావడం చూశా. అది రాత్రి 8గంటల సమయం అనుకుంటా. ఇదేంటి నాకు ఎలాంటి సంబంధం లేని వివాదంలో నా పేరు వినిపిస్తోంది అని అనుకున్నా. నాగబాబుగారు కోరిన విధంగానే హైదరాబాద్ వచ్చాక ఆయనకు ఫోన్ చేశా అని పృథ్వి తెలిపారు. అలాంటి ఆరోపణలు నేను చేస్తానని మీరు అనుకున్నారా అని అడిగా.. అక్కడితో ఆ వివాదం ముగిసింది అని పృథ్వి తెలిపాడు.

మంచి స్నేహితుడు
ప్రజారాజ్యం సమయం నుంచే నాగబాబు తనకు మంచి స్నేహితుడు అని పృథ్వి తెలిపాడు. ఆయన ద్వారానే ప్రజారాజ్యం పార్టీ కోసం ఉత్తరాంధ్రలో పనిచేశా. ఉత్తరాంధ్ర జిల్లాలో విద్యార్థులందరిని ఏకం చేశానని పృథ్వి తెలిపాడు. అలా నాగబాబుతో మంచి స్నేహం ఏర్పడినట్లు పృథ్వి తెలిపాడు. ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేవారు ఎక్కువగా ఉంటారని పృథ్వి ఆరోపించాడు.


Click it and Unblock the Notifications











