For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలీ కష్టాల్లో మునిగి తేలాడు, పవన్ మాటతో చాలా బాధ పడ్డాడు: కమెడియన్ పృథ్వి

|
Comedian Prudhvi Raj About Pawan Kalyan And Ali Controversy || Filmibeat Telugu

పవన్ కళ్యాణ్, అలీ అంటే మొన్నటి వరకు ఇండస్ట్రీలో మంచి స్నేహితులు అనే టాక్ ఉండేది. అయితే ఇటీవల ఎన్నికల సమయంలో జరిగిన సంఘటనతో పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. అలీ నా స్నేహితుడని నమ్మి సహాయం చేశాను, కానీ నమ్మక ద్రోహం చేశాడు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం సంచలనం అయిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ మాటతో అలీ చాలా హర్ట్ అయ్యాడు. తన తోటి కమెడియన్లకు కూడా ఫోన్ చేసి నా గురించి ఆయన అలా అన్నారేంటి? అంటూ బాధపడ్డారట. ఈ విషయాన్ని కమెడియన్ పృథ్వి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

పవన్, అలీ బంధం చూసి అలా అనుకునేవారం

పవన్, అలీ బంధం చూసి అలా అనుకునేవారం

‘‘పవన్ కళ్యాణ్ గారు, అలీ స్నేహ బంధం చూసి మేమంతా..ఏ సినిమాలో చూసినా వీరే ఉంటున్నారు, అలీని తప్ప ఎవరినీ పెట్టేకోడా ఈయన అనుకునేవారం. వేదికలు ఎక్కి కౌంగిలించుకేనే వారు, షూటింగుల్లో చాలా మాట్లాడుకునేవారు. మా లాంటి వారం పవన్ కళ్యాణ్‌తో మాట్లాడే ధైర్యం చేసేవారం కాదు. ఆయన కనిపిస్తే నమస్కారం పెట్టడం.... నీ బాంచన్ దొర కాళ్లు మొక్కుతాం అంటూ దూరంగా కూర్చునేవారం, పిలిచినపుడు మాత్రమే వెళ్లేవారం.'' అని పృథ్వి గుర్తు చేసుకున్నారు.

అలీ కష్టాల తొట్లో మునిగి తేలాడు

అలీ కష్టాల తొట్లో మునిగి తేలాడు

అలీ, మేమంతా చెన్నై నుంచి ట్రావెల్ అయిన బ్యాచ్. కష్టం అనే తొట్లో మునిగి బయటకు వచ్చిన వ్యక్తి అతడు. తను చేసిన సహాయాలు, గొప్ప పనులు ఎప్పుడూ చెప్పుకోడు. వాళ్ల నాన్న గారి పేరు మీద ట్రస్ట్ పెట్టాడు... అని పృథ్వి రాజ్ తెలిపారు.

ఆ మాటతో అలీ చాలా బాధ పడ్డాడు

ఆ మాటతో అలీ చాలా బాధ పడ్డాడు

‘‘ఆయన(పవన్ కళ్యాణ్) అలీ చుట్టానికి నేను సీటిచ్చాను. నాకు నమ్మక ద్రోహం చేశాడు అంటున్నారు. పవన్ నుంచి ఆ మాట వచ్చిన తర్వాత అలీ నాకు ఫోన్ చేశాడు. అన్నా ఏంటిది.. నా గురించి ఎందుకలా మాట్లాడుతున్నాడు, నాకు తెలిసి నన్ను అడిగి ఎవరికీ సీట్లు ఇవ్వలేదు. పార్టీ పెట్టినపుడు కూడా నన్ను జాయిన్ అవ్వమని పిలవలేదు. ఇవేవీ లేకుండా నన్ను అంత మాట అన్నాడు'' అని అలీ బాధ పడ్డట్లు పృథ్వి వెల్లడించారు.

అప్పటికీ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి రాలేదు

అప్పటికీ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి రాలేదు

మైనారిటీ వర్గానికి చెందిన ఒక అబ్బాయి రాజమండ్రి నుంచి బయల్దేరి చెన్నై వచ్చి సీతాకోక చిలుక నుంచే నటించడం మొదలు పెట్టారు. పవన్ క ళ్యాణ్ అప్పటికీ ఇంకా ఇండస్ట్రీకి రాలేదు. అప్పట్లో మేమంతా చెన్నైలో మోహన్ బాబుగారి ఇంటికి, చిరంజీవి గారి ఇంటికి చాలా దూరం నడుచుకుంటూ వెళ్లి వారిని దూరం నుంచి చూసి ఆనందపడే వారం.. అని పృథ్వి గుర్తు చేసుకున్నారు.

చిరంజీవిని మోసం చేసింది ఎవరో అందరికీ తెలుసు

చిరంజీవిని మోసం చేసింది ఎవరో అందరికీ తెలుసు

‘‘చిరంజీవిగారు మితభాషి, ఎదుటివారిని నొప్పించే మనస్తత్వం కాదు. ఆయన్ను ఎవరు మోసం చేశారు అనేది వారి కుటుంబంలో అందరికీ తెలుసు. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.'' అని పృథ్వి రాజ్ తెలిపారు.

English summary
Comedian Prudhvi Raj about Pawan Kalyan and Ali controversy. A few days ago, actor and Jana Sena Chief Pawan Kalyan attacked noted comedian Ali for joining the YSR Congress Party and said that he was deeply hurt by his actions. He also said that going forward, he would trust his fans rather than his friends. Needless to say, these comments created a great deal of buzz in the film industry and the political world alike. Following this, Ali attacked the Gabbar Singh star and said that he would have been nothing without Megastar Chiranjeevi's support.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more