కమెడియన్ పృథ్వీకి బంపర్ ఆఫర్.. మాట నిలుపుకున్న జగన్

తన కామెడీ టైమింగ్‌తో, తనదైన విలక్షన నటనతో తెలుగు చిత్ర సీమలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు పృథ్వీ. 'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో.. ఆయన కూడా అదే స్థాయిలో పాపులర్ అయిపోయారు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన పృథ్వీ.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.

ఆ తర్వాత సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ చెప్పి పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆయనకు జగన్ కీలక పదవిని కట్టబెట్టారు. అంతేకాదు, భవిష్యత్‌లో కీలక పదవి అప్పగిస్తానని మాటిచ్చారు. పార్టీలోనే అత్యంత ముఖ్యమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని పృథ్వీకి కేటాయించారు. దీంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో పని చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. అప్పుడప్పుడూ ప్రెస్‌మీట్లు పెడుతూ.. అప్పటి అధికార పార్టీ తెలుగుదేశంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు కురిపించేవారు.

Comedian Prudhvi Raj Appointed As SVBC Chairman

ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్.. ఎన్నికల్లో పృథ్వీ పడిన కష్టాన్ని గుర్తించారు. ఇందుకుగానూ ఈ కమెడియన్‌కు మరో పదవిని కేటాయించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నామినేటెడ్ పదవులను ఒక్కొక్కటిగా భర్తీ చేసుకుంటూ వస్తున్న జగన్.. తాజాగా మరో పోస్టును భర్తీ చేశారు. అదే.. అత్యంత ముఖ్యమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్‌వీబీసీ) చైర్మన్ పదవి. దీనిని పృథ్వీ రాజ్‌‌కు కేటాయించారు ఏపీ సీఎం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అంతకు ముందు ఈ పదవిని ప్రముఖ సినీదర్శకుడు కే రాఘవేంద్రరావు నిర్వర్తించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఆయనకు ఈ పదవిని కేటాయించింది. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఆయన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్‌వీబీసీ) చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వయోభారం వల్ల భక్తి ఛానెల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అంతేకాదు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యాజమాన్యానికి, సిబ్బందికి ఆ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X