హీరోయిన్‌గా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూతురు.. తండ్రి రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్

కమెడియిన్, నటుడు పృథ్వీ రాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగ్ తో చాలా పాపులర్ అయిన పృథ్వీరాజ్ అనేక సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి అలరించారు.

ఆ మధ్య కొంతకాలం సినిమాలకు దూరమై రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన తొలిసారిగా దర్శకత్వం చేయనున్నారు. అంతేకాకుండా పృథ్వీరాజ్ డైరెక్ట్ చేస్తున్న సినిమాతోనే ఆయన కూతురు శ్రీలు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.

Comedian Prudhvi Raj Daughter Sreelu As Heroine And Comments On His Political Career

నక్సలైట్ పాత్రతో: ఈవీవీ సత్యనారయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు పృథ్వీరాజ్. తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయన కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు. తర్వాత కొన్నిరోజులకు కృష్ణవంశీ దర్శకత్వంలోని సింధూరం సినిమాలో నక్సలైట్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చంద్రలేఖ, ఇడియట్, సముద్రం వంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు చేశారు.

Comedian Prudhvi Raj Daughter Sreelu As Heroine And Comments On His Political Career

తొలిసారిగా డైరెక్షన్: ఇక ఖడ్గం సినిమాలో నటుడిగా 30 ఇయిర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే ఒకే ఒక్క డైలాగ్ తో విపరీతంగా పాపులర్ అయ్యారు పృథ్వీరాజ్. అనంతంర పోకిరి, ఢీ, రెడీ, కిక్, దూకుడు, గబ్బర్ సింగ్ ఇలా దాదాపుగా 72 చిత్రాల్లో నటించారు. ఇక లౌక్యం సినిమాలో బాయిలింగ్ స్టార్ బబ్లూగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆలాగే సీరియళ్లలో కూడా నటించిన పృథ్వీరాజ్ తాజాగా దర్శకత్వ బాధ్యతలు చెపట్టనున్నారు.

Comedian Prudhvi Raj Daughter Sreelu As Heroine And Comments On His Political Career

తండ్రి రాజకీయాలపై: పృథ్వీరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'కొత్త రంగుల ప్రపంచం'. క్రాంతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ కుమార్తె శ్రీలు హీరోయిన్ గా తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ గా చేయడం, తండ్రి పృథ్వీ రాజకీయాలు, దర్శకత్వ బాధ్యతలపై పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది శ్రీలు.

Comedian Prudhvi Raj Daughter Sreelu As Heroine And Comments On His Political Career

చాలా ఫ్రెండ్లీగా: "నన్ను నమ్మి మా అమ్మ, నాన్న పెద్ద బాధ్యతగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నారు. నీ ముందే నీ గురించి మాట్లాడేవాళ్లు చాలా మంది ఉంటారు. అది మంచి కావచ్చు. చెడు కావచ్చు. కానీ వాటిని పట్టించుకోవద్దు అని నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. ఆయనే నాకు స్ఫూర్తి. ఇంట్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంతవరకు నాపై ఎప్పుడూ అరవలేదు. ఆయన కుమార్తెగా నాన్న గారి నటన అంటే ఎంతో ఇష్టపడుతుంటాను" అని శ్రీలు తెలిపింది.

ఇండస్ట్రీలోనే సంతోషంగా: "నాన్న రాజకీయాల్లోకి వెళ్లడం నాకు ఇష్టం లేదు. నిజానికి నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు. ఇండస్ట్రీలోనే మేము సంతోషంగా ఉన్నాం. అయితే నాన్నగారికి చిన్ననాటి నుంచి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. దాన్ని మేం వద్దని చెప్పలేం. కానీ ఆయన పాలిటిక్స్ నాకు నచ్చుదు" అని శ్రీలు చెప్పుకొచ్చింది.

Comedian Prudhvi Raj Daughter Sreelu As Heroine And Comments On His Political Career

నేనూ ఆడిషన్ ఇచ్చాను: "ప్రొడ్యూసర్ గా నన్ను నమ్మి సినిమా చేయడం అనేది చిన్న విషయం కాదు. నిజంగా చాలెంజింగ్ అయిన విషయం. ముందుగా హీరో క్రాంతిని సెలెక్ట్ చేసిన తర్వాతే నన్ను ఎంపిక చేసుకున్నారు. నేను కూడా ఆడిషన్ ఇచ్చాను" అని కమెడియన్ పృథ్వీరాజ్ కుమార్తె హీరోయిన్ శ్రీలు తెలిపింది. కాగా కొత్త రంగుల ప్రపంచం సినిమాను పీఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X