హీరోను చూస్తే.. స్టేట్ రౌడీలో చిరంజీవిలా కనిపిస్తాడు.. కమెడియన్ పృథ్వీ

దీపాల ఆర్ట్స్ సమర్పణలో సింహ ఫిలిమ్స్ పతాకంపై తనిష్క్ రెడ్డి హీరోగా, శివగణేష్ దర్శకత్వంలో అనిల్, త్రినాథ్, కిషోర్, శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం 'సకల కళా వల్లభుడు'. ఈ చిత్ర టీజర్‌ను పృథ్వీ (30ఇయర్స్ ఇండస్ట్రీ) చే విడుదల చేయించారు. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ మాట్లాడుతూ... ''హీరో తనిష్క్ మా సినిమాకు పెద్ద ఎస్సెట్. ఫైట్స్ డాన్సులు బాగా చేసాడు. మిగతా టీమ్ కూడా చాలా కష్టపడి పని చేశారు. ప్రస్తుతం మా సకల కళా వల్లభుడు సినిమా సెన్సార్ క్లీయరెన్సు కోసం ఎదురుచూస్తోంది. రాగానే విడుదల ఉంటుంది అని తెలిపారు.

 పవర్‌స్టార్ పవన్ హెయిర్ స్టయిల్‌తో

పవర్‌స్టార్ పవన్ హెయిర్ స్టయిల్‌తో

సకల కళా వల్లభుడు సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ యాక్షన్ మూవీ. ఈ సినిమాలో చిరు గారి పోస్టర్స్, మెగా పవర్ స్టార్ హెయిర్ స్టయిల్, బన్నీ సాంగ్ ఉంటుంది. మెగా అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుంది మా ప్రయత్నం. మంచి సినిమాలో నేను ఒక పార్ట్ అయ్యినందుకు హ్యాపీ గా ఉంది అని హీరో తనిష్క్ రెడ్డి అన్నారు.

 యూత్ కనెక్ట్ అయ్యే సినిమా

యూత్ కనెక్ట్ అయ్యే సినిమా

యూత్‌కు కనెక్ట్ అయ్యే చిత్రం ఈ సకల కళా వల్లభుడు. తనిష్క్ మంచి నటుడే కాదు చాలా కళలు ఉన్నాయతనికి. అది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. అతని లుక్ చూస్తే స్టేట్‌రౌడీలో చిరు గారి లుక్ కనిపిస్తుంది. ఇక నేను ఈ సినిమాలో బాబా పాత్రను పోషించాను. ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంది నా పాత్ర. అందరికీ నచ్చే చిత్రం అవుతుంది అని కమెడియన్ పృథ్వీ అన్నారు.

మంచి చిత్రాన్ని అందించే విధంగా

మంచి చిత్రాన్ని అందించే విధంగా

డివోపి, మ్యూజిక్ డైరెక్టర్ ల ఔట్ ఫుట్ చాలా బాగా ఇచ్చారు. డైరెక్టర్ శివ గణేష్ మాకు మంచి మిత్రుడు. మమ్మల్ని భరించి సినిమాను పూర్తి చేశారు. ఆర్టిస్టులు అందరూ మంచి సపోర్ట్ ను అందించారు. ఈ సినిమా విడుదల అనంతరం బుర్రకథ చిత్రంతో రానున్నాము. ఇలానే ఏడాదికి 2 సినిమాలు మా బ్యానర్ నుంచి వస్తాయని తెలియ చేస్తున్నాము. మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలనేదే మా ఆకాంక్ష అని నిర్మాత శ్రీకాంత్ అన్నారు.

 పృథ్వీ కామెడీ హైలెట్‌గా

పృథ్వీ కామెడీ హైలెట్‌గా

యాక్షన్ కామెడీ జోనర్. నిర్మాతలు నా ఫ్రెండ్స్ కనుక చాలా సపోర్టివ్ గా నిలిచారు. వారి సహకారంతోనే సినిమా పూర్తి చేయగలిగాను. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే... పృథ్వీ గారి కామెడీ హైలెట్ అవుతుంది. హీరో తనిష్క్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అక్టోబర్- నవంబర్ మధ్యలో సినిమా రిలీజ్ ఉంటుంది అని డైరెక్టర్ శివగణేష్ చెప్పారు.

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

తనిష్క్ రెడ్డి, మేఘల గుప్తా, జీవ, పృథ్వీ, సుమన్, చిన్నా, శృతి, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: సాయి చరణ్, ఎడిటర్: ధర్మేంద్ర, మ్యూజిక్: అజయ్ పట్నాయక్, నిర్మాతలు: అనిల్, త్రినాథ్, కిషోర్, శ్రీకాంత్; డైరెక్టర్: శివగణేష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X