ఇప్పుడిది 'కత్తి' మీద సామే; ఆయనే బతికి ఉంటే.., ఇప్పుడు ముందుకొచ్చే పెద్ద మనిషి ఎవరు?
మహేష్ కత్తి వివాదానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడదా?.. ఈ విషయంలో చొరవ తీసుకుని పరిష్కరించే వ్యక్తే లేరా?.. కత్తి వెనక్కి తగ్గకపోవడం.. పవన్ కల్యాణ్ దిగొచ్చేలా లేకపోవడం.. ఈ వివాదాన్ని రోజురోజుకు పెంచుకుంటూ పోతుందే తప్ప దీనికో ఎండ్ అంటూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్ ఈ వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Recommended Video


ఆయనే బతికి ఉంటే:
తమ గురువు దాసరి నారాయణరావు గారే గనుక బతికున్నట్టయితే కత్తి మహేశ్-పవన్ కల్యాణ్ అభిమానుల వివాదం ఇంత దాకా వచ్చేది కాదని పృథ్వీరాజ్ అభిప్రాయపడ్డారు. ఇరువురిని కూర్చోబెట్టి, వారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించేవారని అన్నారు.

బహింగ చర్చతో పరిష్కారం?:
ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీలో ఎవరైనా పెద్ద మనిషి చొరవ తీసుకుని ముందుకు రావాలని పృథ్వీ సూచించారు. పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు, కత్తి మహేశ్‌తో ఓ బహిరంగ చర్చ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని అన్నారు.

'కత్తి' మీద సామే..:
కత్తి-పవన్ ఫ్యాన్స్ వివాదంపై మాట్లాడటమంటే కత్తి మీద సాము చేయడమేనని, ఈ సమస్యను ప్రజలకే వదిలేయాలని చర్చ ద్వారానే దీన్ని పరిష్కరించుకోవాలని పృథ్వీ సూచించారు. కత్తి మహేష్, పవన్ కల్యాణ్, ఆయన అభిమానులతో బహిరంగ చర్చ పెడితే.. అన్ని మీడియా చానెళ్లను కూడా ఆహ్వానించాలని ఆయన సూచించారు.

ఎవరా పెద్ద మనిషి?:
ఇండస్ట్రీలో దాసరి లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని పృథ్వీ పరోక్షంగా చెప్పారనే అనాలి. ఇప్పుడు వపన్ ఫ్యాన్స్-కత్తి వివాదాన్ని పరిష్కరించడానికి ఎవరైనా పెద్ద మనిషి ముందుకు రావాలని ఆయన కోరుతున్నారు. కానీ ఎవరా పెద్ద మనిషి?... అలా ముందుకు వచ్చేదెవరు?. ఇదో సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుందా.. లేక చొరవ తీసుకుని ఎవరైనా ముందుకొస్తారా? అన్నది చూడాలి.

ఎటు పోతుందో?:
ఇప్పటికైతే కత్తి మహేష్-పవన్ ఫ్యాన్స్ వివాదంలో రచయిత కోన వెంకట్ మాత్రమే కాస్త చొరవ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 15వ తేదీ వరకు ఇరువురు దీనిపై మౌనంగా ఉండాలని అనవసర రాద్దాంతం వద్దని ఆయన సూచించారు. దీంతో 15వ తేదీ తర్వాత ఆయనేం చేయబోతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

పవన్ రంగంలోకి దిగుతారా?:
జనవరి 10న అజ్ఞాతవాసి రిలీజ్ ఉండటంతో.. ఆ సినిమా విడుదల తర్వాత పవన్ దీనిపై ఫోకస్ చేయనున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ పవన్ గనుక రంగంలోకి దిగితే దీనికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ వేసేలా చర్యలు తీసుకుంటారని అంటున్నారు. ఏదేమైనా మరికొద్ది రోజులు పోతే తప్ప ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు.


Click it and Unblock the Notifications











