దూల తీర్చుకోవడం ఇష్టం లేదు, కసిమీద ఉన్నాం, జెండా ఊపుతా: కమెడియన్ పృథ్వి

Recommended Video

Comedian Prudhvi Raj Predicted YSRCP Government in 2019 For Sure

తెలుగులో టాప్ కమెడియన్‌గా తన సత్తాచాటుతున్న పృథ్వి వచ్చే ఏపీ ఎన్నికల్లో తన మద్దతు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే అని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూల్ చేయడం ఖాయం అని, తమ పార్టీనే అధికారంలోకి వచ్చితీరుతుందని వ్యాఖ్యానించారు.

మీరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? అనే ప్రశ్నకు పృథ్వి అలాంటిదేమీ లేదని తెలిపారు. రాజకీయం అంటే దూల... దూల తీర్చుకోవడానికి వెళ్లడం లేదు, ప్రజలకు సేవ చేయడానికే వెళుతున్నాను అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

సేవ చేయడానికి రాజకీయాలు అవసరం లేదు

సేవ చేయడానికి రాజకీయాలు అవసరం లేదు

ప్రజలకు సేవ చేయాలంటే ఎక్కడి నుంచైనా పోటీ చేయాలి... మీరు ఏ సీటు ఆశిస్తున్నారు? అని ఓ ఛానల్ వారు ప్రశ్నించగా సామాజిక సేవ చేయాలంటే పవర్‍‌తో సంబంధం లేదు. మంచి పని చేస్తే రాజకీయనాయకుల అండదండలు తప్పకుండా ఉంటాయి. నాలాంటి వారు పోటీ చేయకపోయినా ఫర్వాలేదు. జగన్ లాంటి వారు గెలిస్తే మంచి జరుగుతుందన్నారు.

ఆయన ముందు జెండా ఊపుతా

ఆయన ముందు జెండా ఊపుతా

పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నపుడు ఓ ముసలాయన జెండా పట్టుకుని మోటివేట్ చేసేవాడు. షార్జా కప్‌లో జావేద్ మియాందాద్ 3 రన్స్ కొట్టకుండా ఆపితే ఇండియా విజయం సాధిస్తుంది. కానీ ఆ ముసలాయన జెండా ఊపగానే మియాందాద్ సిక్స్ కొట్టాడు. నేను కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం చైర్లో కూర్చుంటే ఆయన ఏ పర్యటనకు వెళితే ఆ పర్యటన ముందు జెండా ఊపుతూ ఉండాలి. అదే నా కోరిక... అని పృథ్వి తెలిపారు.

మేమంతా కసిమీద ఉన్నాం

మేమంతా కసిమీద ఉన్నాం

ఏ పార్టీవారు ఎలా పోయినా మాకు అనవసరం. 2019లో రూల్ చేసేది వైసీపీ. మేమంతా కసిమీద ఉన్నాం. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పథకాలు ఎలా ఉండాలి, సంక్షేమం ఎలా ఉండాలో చేసి చూపిస్తామని పృథ్వి తెలిపారు.

పృథ్వి వరుస ఇంటర్వ్యూలు

పృథ్వి వరుస ఇంటర్వ్యూలు

ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పృథ్వి మీడియాలో తన వాయిస్ పెంచారు. తెలుగుదేశం, జనసేన పార్టీలపై విమర్శలు చేస్తూ తనదైనశైలిలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X