నేను, పోసాని, కేఏ పాల్ వస్తే... బిగ్‌బాస్ షోలో వాళ్లని కడిగిపారేస్తాం: కమెడియన్ పృధ్వీ

By Bojja Kumar

బిగ్‌బాస్ షో మీద కమెడియన్ పృధ్వి సంచలన కామెంట్స్ చేశారు. ఆ షో వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ...ఈ షో ద్వారా జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ షోలో సరైన వారు ఎవరూ లేరని.... ఈ షోలోకి పోసాని కృష్ణమురళి, కేఏపాల్, నా లాంటి వారు వెళితే అసలు మజా వస్తుందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే బిగ్‌బాస్ చెప్పినట్లు ఉండటం మా వల్ల కాదని, మాకు నచ్చినట్లు ఉంటామని తెలిపారు.

పృధ్వీ దృష్టిలో బిగ్‌బాస్ షో ఎలా ఉందంటే..

పృధ్వీ దృష్టిలో బిగ్‌బాస్ షో ఎలా ఉందంటే..

బిగ్‌బాస్ షో వల్ల ఎవరికి ఉపయోగం? అందరినీ ఒక గదిలో పెట్టారు. ఇది ఎలా ఉందంటే ఒక పెద్ద ఊర్లో ఒక పెళ్లి...పెళ్లికి అందరూ రావడం, అందరూ పడుకుని ఉండటం, వీడి మ్యారేజ్ అయిపోయినా వీడికి సంబంధించిన లవర్స్ ఉంటారు. ఆ అమ్మాయిని చేసుకోవడానికి అంతకు ముందు ఎవడో పెళ్లి కొడుకు వచ్చి ఉంటాడు. వాడు దూరం నుండి జాలితో చూస్తుంటాడు. ఏ అర్ధరాత్రో వెళ్లి వాళ్లిద్దరూ మాట్లాడుకుంటారు... ఇదే బిగ్‌బాస్ షో అని పృధ్వి అన్నారు.

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 54 Highlights Pooja Became As A Captain
జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు

జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు

ఈ షో వల్ల ఎవరికి ఉపయోగం? జనాలను పిచ్చోళ్లను చేయడం తప్ప. వాడొచ్చి దీన్ని గిల్లాడు, వీడొచ్చి దాన్ని కదిలించాడు... బాస్ మిమ్మల్ని పిలుస్తున్నాడు రండీ! వేరే పని పాటలు లేవు వీళ్లకు. ఇదేనా ఈ షోలో చూపించేది? అని పృధ్వీ వ్యాఖ్యానించారు.

 అందుకే వెళ్లలేదు...

అందుకే వెళ్లలేదు...

నిద్ర పోతున్నపుడు అందరూ ఒక చోటే అంట...నాకు నిద్రలో లేచే అలవాటుందయ్యా... ఎవడి పక్కలో పడుకుంటానో తెలియదు, రేపు పొద్దున్న పెద్ద గొడవైందనుకోండి... పృధ్వీరాజ్ తెలిసే ఒకావిడ పక్కలో పడుకున్నాడు అంటారు... అందుకే నేను ఈ షోకు వెళ్లలేదు అని పృధ్వి అన్నారు.

 నేను, పోసాని, కేఏ పాల్ వస్తే... బిగ్‌బాస్ షోలో వాళ్లని కడిగిపారేస్తాం

నేను, పోసాని, కేఏ పాల్ వస్తే... బిగ్‌బాస్ షోలో వాళ్లని కడిగిపారేస్తాం

రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నాకు వెళ్లే అవకాశం వస్తే... లోపలికి వెళ్లి అందరినీ కడిగేస్తా. అందులో ధర్మ పరిరక్షణార్థం ధర్మో రక్షతి రక్షిత: అని మాట్లాడే ఒకాయన ఉన్నారు. బిగ్‌బాస్ షోలో కరెక్ట్ మజా ఉండాలంటే పోసాని కృష్ణ మరళి రావాలి, పృధ్వీ రాజ్ రావాలి, డాక్టర్ కె.ఏ.పాల్ రావాలి. ఇలాంటి వాళ్లం ఉంటే మొత్తం కడిగి అవతల పారేసేవాళ్లం... అని పృధ్వి అన్నారు.

 గోకాలన్నపుడు గోకడం, పడుకోవాలన్నపుడు పడుకోవడం

గోకాలన్నపుడు గోకడం, పడుకోవాలన్నపుడు పడుకోవడం

ఒకవేళ అవకాశం వస్తే సాయంత్రం ఆరు గంటల వరకే చేస్తాం. ఇలా అర్ధరాత్రి వరకు తిరిగే సంస్కృతి మాది కాదు. రాత్రంతా పని పాట లేకుండా తిరిగి, వాడొచ్చి దీన్ని గోకాడు, వీడొచ్చి దాన్ని గోకాడు లాంటివి మాకు తెలియదు. గోకాలన్నపుడు గోకడం, పడుకోవాలన్నపుడు పడుకోవడం అలా ఉంటే మేము రెడీ....అని పృధ్వి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X