ఆయన ముందు కుప్పిగంతులా.. ఇంటికొచ్చి కొడతారు: పవన్ పాలిటిక్స్‌పై పృథ్వీ షాకింగ్ కామెంట్స్
ఎంతో కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా వెలుగొందుతున్నాడు పృథ్వీ రాజ్. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే కొన్ని వందల చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ మధ్య సినిమాలకు బ్రేకిచ్చిన ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించాడు. అక్కడ కూడా సక్సెస్ అవడంతో మంచి పదవిని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఓ వివాదంలో చిక్కుకుని సర్వం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మెగా హీరోలతో పాటు పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పాపులారిటీ
దాదాపు మూడు దశాబ్దాల క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు పృథ్వీ రాజ్. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన.. క్రమంగా మంచి రోల్స్‌లో నటించాడు. ఈ క్రమంలోనే ‘ఖడ్గం' సినిమాలో ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ' అంటూ డైలాగ్ చెప్పి పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ‘లౌక్యం'లో బబ్లూ పాత్రతో మరింత ఫేమస్ అయ్యాడీ కమెడియన్ కమ్ యాక్టర్.

ఆ పార్టీలో చేరిక... గెలిచే వరకూ అక్కడే
సినిమాల్లో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలో పృథ్వీ రాజ్.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వెంటనే జగన్ పార్టీలోనే అత్యంత ముఖ్యమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని పృథ్వీకి కేటాయించారు. దీంతో మరింత ఉత్సాహంగా పని చేసిన ఆయన.. జగన్ సీఎం అయ్యే వరకూ ఎన్నో కార్యక్రమాలు చేసి ఆకట్టుకున్నాడు.

ప్రతిష్టాత్మక పదవికి ఎంపికైన పృథ్వీ రాజ్
సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు కోసం ఎంతగానో శ్రమించిన పృథ్వీ రాజ్‌కు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్‌మోహన్ రెడ్డి కీలక పదవిని అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత నామినేట్ పదవులు భర్తీ చేస్తూ.. అత్యంత ముఖ్యమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా ఆయనను నియమించారు. దాదాపు ఏడాది కాలం పాటు అందులో ఆయన పని చేశాడు.

మహిళలో అసభ్యంగా.. మొత్తం మారింది
ఎస్‌వీబీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పృథ్వీ రాజ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఆయన అసభ్యంగా మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ఇది బాగా హైలైట్ అవడంతో తన పదవికి రాజీనామా చేశాడాయన. దీని వల్ల పదవితో పాటు పేరు ప్రతిష్టలు కూడా కోల్పోయాడు. ఆ సమయంలో సొంత పార్టీ నాయకులపై పృథ్వీ రాజ్ ఆరోపణలు చేశాడు.

మెగా హీరోలపై పృథ్వీ రాజ్ ప్రశంసల వర్షం
రాజకీయాల కారణంగా పృథ్వీ రాజ్ చాలా సినిమా అవకాశాలు కోల్పోయాడు. ఇలాంటి సమయంలో చిరంజీవే స్వయంగా ఆయనకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి మళ్లీ బిజీ అయిపోయాడు పృథ్వీ. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం.

కావాలని టార్గెట్ చేస్తే కొడతారని తెలుసు
ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాగబాబు గారు నాతో మట్లాడడం లేదు. కానీ, నాకు చిరంజీవి గారు, పవన్ గారు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. రాజకీయాల కోసం జనసేనానిపై విమర్శలు చేయాల్సి వచ్చింది. అదే మామూలుగా తిడితే ఇంటికొచ్చి మరీ కొడతారు. వాళ్ల స్థాయి నాది కాదు.. నేనేదైనా చేస్తే హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా ఉంటుంది. నా ఉద్దేశ్యంలో పవన్ సినిమాలు చేస్తేనే బెటర్' అని పృథ్వీ రాజ్ వివరించాడు.


Click it and Unblock the Notifications











