For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pawan Kalyanపై పృథ్వీ షాకింగ్ కామెంట్స్: ఆయన దృష్టి మొత్తం వాళ్ల మీదే.. అందుకే సినిమాలు చేస్తున్నారంటూ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది ఆర్టిస్టులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని గుర్తింపును అందుకుంటారు. అలాంటి వారిలో కమెడియన్ పృథ్వీ రాజ్ ఒకరు. '30 ఇయర్స్ ఇండస్ట్రీ' అనే డైలాగ్‌తో పాపులర్ అయిన ఆయన.. సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో విభిన్నమైన పాత్రలను పోషించారు. అందులో కమెడియన్‌గా సత్తా చాటారు. ఆ మధ్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారాయన. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ఒకే ఒక్క డైలాగ్‌తో ఫుల్ ఫేమస్

  ఒకే ఒక్క డైలాగ్‌తో ఫుల్ ఫేమస్

  చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు విలక్షణ నటుడు పృథ్వీ రాజ్. అప్పట్లో అన్ని రకాల పాత్రలను పోషించిన ఆయన.. కొంత కాలంగా హాస్య ప్రధానమైన రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఖడ్గం' సినిమాలో ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ' అంటూ చెప్పిన డైలాగ్‌తో ఫుల్ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ‘లౌక్యం'లో బబ్లూ పాత్రతో ఎన్నో మరపురాని క్యారెక్టర్లు చేసి మెప్పించారు.

   రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడుగా

  రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడుగా

  ఈ మధ్య కాలంలో పృథ్వీ రాజ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ఆయన కోసం ఎంతో మంది దర్శకులు కొత్త కొత్త పాత్రలు క్రియేట్ చేస్తూ వచ్చారు. సరిగ్గా అలాంటి సమయంలోనే ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు జగన్ ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని పృథ్వీకి కేటాయించారు. అప్పటి నుంచి మరింత రెచ్చిపోయారు.

   ఆ హీరోలను కూడా వదలకుండా

  ఆ హీరోలను కూడా వదలకుండా

  ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించే నందమూరి బాలకృష్ణతో పాటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై పృథ్వీ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అదే సమయంలో మిగిలిన ఆర్టిస్టులను వైసీపీలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వాళ్లందరితో కలిసి జగన్‌కు మద్దతుగా నిలిచారు. తద్వారా ఆయన గెలుపులో భాగమయ్యారు.

   గొప్ప పదవిని చేపట్టిన పృథ్వీరాజ్

  గొప్ప పదవిని చేపట్టిన పృథ్వీరాజ్

  సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు కోసం ఎంతగానో శ్రమించిన పృథ్వీ రాజ్‌కు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్‌మోహన్ రెడ్డి కీలక పదవిని అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత నామినేట్ పదవులు భర్తీ చేస్తూ.. అత్యంత ముఖ్యమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా ఆయనను నియమించారు. ఆ తర్వాత ఓ వివాదం కారణంగా దాని నుంచి వైదొలిగారు.

   ఛాన్స్‌లు మిస్.. చిరంజీవి చొరవతో

  ఛాన్స్‌లు మిస్.. చిరంజీవి చొరవతో

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కారణంగా పృథ్వీ రాజ్‌ చాలా సినిమా అవకాశాలు కోల్పోయారు. ఒకానొక సమయంలో ఆయన చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేకుండా పోయిందన్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవే స్వయంగా ఆయనకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి మళ్లీ బిజీ అయిపోయాడు పృథ్వీ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు.

   పవన్‌పై పృథ్వీ షాకింగ్ కామెంట్స్

  పవన్‌పై పృథ్వీ షాకింగ్ కామెంట్స్

  ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్‌పై ఒంటికాలిపై లేచారు కమెడియన్ పృథ్వీ రాజ్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మరింతగా రెచ్చిపోయిన ఆయన జనసేనానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కానీ, ఎస్‌వీబీసీ చైర్మన్ పదవి పోయిన తర్వాత పవన్ విషయంలో పంథాను మార్చుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవర్ స్టార్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

  Cinema Bandi Review, డోంట్ మిస్.. మంచి సినిమా | Netflix | Tollywood || Filmibeat Telugu
   అందుకే సినిమాలు చేస్తున్నారంటూ

  అందుకే సినిమాలు చేస్తున్నారంటూ

  తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవన్ గురించి మాట్లాడుతూ.. ‘పవన్ సినిమాలు చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. అసలు అందులో తప్పేముంది. అది ఆయన వృత్తి. జగన్‌ లాగే ఆయనకు కూడా ప్రజల మీద దృష్టి ఎక్కువ. అందుకే వాళ్ల తరపున పోరాడుతున్నాడు. వైసీపీ వాళ్లు ట్రోల్ చేస్తున్న మాట నిజమే. కానీ, ఎవరి దుకాణం వాళ్లది' అంటూ యూటర్న్ తీసుకున్నారు పృథ్వీ.

  English summary
  Balireddy Prudhviraj is an Indian actor and politician who appears in Telugu films. Known for his comic roles, he acted in more than 100 movies. He is noted for his role of "30 Years Industry", in Krishna Vamsi-directed Khadgam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X