అందుకే బాలయ్య వాస్తవాలు చూపించలేదు: కమెడియన్ పృథ్వి
రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై తెలుగు కమెడియన్ పృథ్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కొన్ని గంటల్లో లక్షల మందికి రీచ్ అయింది. ప్రజలు కూడా అందులో వర్మ చూపింది వాస్తవాలే అని నమ్మకంతో ఉన్నారని తెలిపారు.
ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాలు ఇందులో చూపిస్తున్నారు. ఎవరి మీద ద్వేషం కానీ, వక్తిగత కక్ష కానీ లేదని, చరిత్ర ఏమిటనేది ఆయన తన సినిమా ద్వారా చూపించాలనుకున్నారు, అందుకే ఈ చిత్రం తీస్తున్నారని పృథ్వి తెలిపారు.

అందుకే బాలయ్య వాస్తవాలు చూపించలేదు
బాలకృష్ణ తీసిన ‘ఎన్టీఆర్ బయపిక్'లో నిజాలు చూపించరు. నిజాలు చూపించాల్సి వస్తే చంద్రబాబును విలన్‌గా చూపించాలి. ఆయన స్వయాన వీయంకుడు కాబట్టి ఎందుకు అలా చూపిస్తారు?అని పృథ్వి వ్యాఖ్యానించారు.

రాముడు మంచి బాలుడు అన్నట్లు చూపించారు
‘ఎన్టీఆర్ బయోపిక్'లో చంద్రబాబు పాత్రను రానాతో చేయించి రాముడు మంచి బాలుడు అనే విధంగా చూపించారు. కానీ ప్రజలు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూపించేదే వాస్తవాలు అని నమ్ముతున్నారని తెలిపారు.

మాకు ప్రజలపై మనసు ఉంది
కమెడియన్లే ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తున్నారు? అని మీడియా వారు ప్రశించగా.. ప్రజల మీద మాకు మనసు ఉంది. వేరే వారికి లేదు. మాకు కొందరు నిర్మాతలు డబ్బులిచ్చినా.. ఎగ్గొట్టినా మా నవ్వు ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నామని తెలిపారు.

ఏ పార్టీకి పని చేయాలనేది మా ఇష్టం
ఈ దేశంలో ఎవరైనా, ఏ రాజకీయ పార్టీలో అయినా చేరవచ్చు. పౌరులుగా మాకు ఆ హక్కు ఉంది. మాకు నచ్చిన పార్టీలో జాయిన్ అవుతామని పృథ్వితో పాటు కృష్ణుడు స్పష్టం చేశారు. ఈ ఇద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పని చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











