Don't Miss!
- News
Doctor: ఆసుపత్రిలో నగలు చోరీ చేసిన లేడీ డాక్టర్ చిక్కింది, మేడమ్, అసలు మ్యాటర్ !
- Finance
wipro: అప్పుడు వెయిట్ చెయ్యమన్న విప్రో.. ఇప్పుడు వేటు వేసింది..
- Sports
ఆస్ట్రేలియా క్రికెటర్ వివాహేతర సంబంధం.. చెంపలు వాయించిన ప్రేయసి!
- Lifestyle
పీరియడ్స్ మిస్ అయ్యింది, కానీ నెగెటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్: కారణాలను ఏంటో ఇక్కడ తెలుసుకోండి
- Automobiles
సాధారణ ప్రజలనే కాదు కంపెనీ చైర్మన్ మనసు కూడా దోచేసిన Hero Vida.. స్కూటర్ డెలివరీ ఫొటోస్
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
- Technology
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
Jr.NTR పొలిటికల్ కెరీర్ పై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు.. ఆ వయసులో వస్తే బెటర్!
30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ పృథ్వి రాజ్ చాలా రోజుల తరువాత రాజకీయాలపై స్పందించాడు. గత ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీతో కలిసి జాగన్మోహాన్ రెడ్డికి మద్దతు ఇచ్చి మంచి గుర్తింపు దక్కించుకున్న పృథ్వి ఎక్కువ కాలం ఆ గౌరవాన్ని దక్కించుకోలేక పోయాడు. ఇక ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుపై ఈ కమెడియన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సినిమాలతో బిజీగా ఉంటూనే..
కమెడియన్ గా క్లిక్కయిన సమయంలో సినిమాలతో బిజీగా ఉంటూనే పాలిటిక్స్ లోకి వెళ్లిన పృథ్వి ఉహీంచని విధంగా ఒక వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ కాంట్రవర్సీ తో ఒక్కసారిగా విమర్శలపాలైన ఈ యాక్టర్ అప్పటి నుంచి రాజకీయాలకు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు వైసీపీ పార్టీపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ కూడా వేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.

జూ.ఎన్టీఆర్ పాలిటిక్స్ పై కామెంట్స్
ఇక ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుపై పృథ్వి రాజ్ కాస్త వినూత్నంగా స్పందించారు. ఓ వైపు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తూనే మరోవైపు మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటూనే మంచిదని కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

అతని అవసరం లేదు..
పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో అతని అవసరం ఏ మాత్రం లేదు. వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతా సక్రమంగానే సాగుతోంది. అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయగలడు. అతని అవసరం ఇప్పుడే లేదని చెప్పవచ్చని పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

సినిమాలు చేసుకుంటేనే బెటర్
అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కెరీర్ పై స్పందిస్తూ.. అతని కెరీర్ చాలా బావుందని ప్రస్తుతం అతని సినిమాలు చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఇక తారక్ 55ఏళ్ల తరువాత సరికొత్త రాజకీయ ఎజెండాతో రాగలిగితే అక్కడ మంచి భవిష్యత్తు ఉంటుందని వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video

అప్పుడే క్లారిటీ ఇచ్చిన తారక్
పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ విషయాన్ని పక్కన లేడితే.. జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే రెగ్యులర్ పాలిటిక్స్ లోకి రాబోతున్నట్లు మరికొన్ని రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ కోసం అతను రావాల్సిందే అంటూ ఇప్పటికే చాలా మంది నేతలు కోరారు. కానీ తారక్ మాత్రం రాజకీయాల్లోకి రావడానికి ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. గతంలోనే ఈ విషయంపై స్పందించిన తారక్ ఇప్పుడే తనకు ఆ స్థాయి అనుభవం లేదని కూడా క్లారిటీ ఇచ్చాడు.