For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జనసేనలోకి 30 ఇయర్స్ పృథ్వి.. నాగబాబుతో కలిసి చేసిన కీలక ప్రకటన ఏమిటంటే?

  |

  టాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్ గురించి మంచి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మండలాధీశుడు అనే సినిమాతో ఎన్ఠీఆర్ నిజజీవిత పాత్రలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక్క డైలాగ్ తో ఆ డైలాగునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ నేతగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు తాజాగా జనసేన కండువా కప్పుకోవడానికి సిద్ధం అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే

  భక్తి ఛానల్ కు

  భక్తి ఛానల్ కు

  2014 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిన పృథ్వీరాజ్ అప్పటి నుంచి పార్టీ కోసం ప్రచారం చేస్తూ ఉండేవారు. అంతేకాదు సినీ పరిశ్రమ నుంచి వైసీపీకి గట్టి వాయిస్ గా ఉంటూ సినీ గ్లామర్ ను అద్దడంలో సఫలం అయ్యాడు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత అప్పటి వరకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు చైర్మన్ గా ఉన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని తప్పించి పృథ్వి రాజ్ కి ఆ బాధ్యతలు అప్పగించారు ఏపీ సీఎం వైఎస్ జగన్.

  బలవంతంగా

  బలవంతంగా

  అయితే అలాంటి మహత్తర పదవి రావడంతో ఆయన దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించినా నేపథ్యంలో ఆయనకు ఎక్కువ రోజులు నిలవలేదు. ఆయన ఒక మహిళతో సరససల్లాపాలు ఆడుతూ ఉన్నట్లు ఉన్న ఆడియో ఒకటి వైరల్ కావడంతో ఆయన పదవి నుంచి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

  పెద్ద ఎత్తున ఆరోపణలు

  పెద్ద ఎత్తున ఆరోపణలు

  ఆ తర్వాత కూడా ఆ ఆడియో తనది కాదని, తన గొంతు మిమిక్రీ చేశారని, తన మీద కుట్రలు చేశారని కూడా పృథ్వీరాజ్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే అప్పుడూ, ఇప్పుడూ ఆయనను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా ఈ ఆమధ్య ఒక ఛానల్ అధినేత నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ అనే కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీరాజ్ తన రాజకీయ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను అందులో పంచుకున్నారు.

   జనసేన కండువా

  జనసేన కండువా

  అప్పుడే ఆయన జనసేన తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆయన పార్టీలో చేరిక గురించి అప్డేట్ ఇచ్చింది. పృథ్విరాజ్‌ త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నట్టు టాక్ తాజాగా మెగా బ్రదర్‌, జనసేన కీలక నేత నాగబాబును కలిసిన ఆయన. జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఆ దీక్ష ముగియగానే ఉభయగోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఆ సమయంలోనే పృథ్విరాజ్ జనసేన కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.

  బరిలోకి దిగేలా

  బరిలోకి దిగేలా

  అంతేకాదు ఇప్ఫటిదాకా కేవలం ప్రచారానికే పరిమితం అయినా పృథ్వి రాజ్ ఇక మీద ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగేలా ప్లాన్‌ చేసుకుంటున్నారట. తన స్వస్థలం తాడేపల్లిగూడెం నుంచే ఎన్నికల బరిలో దిగుతారనే చర్చ కూడా మొదలయింది. అయితే ఇందులో నిజానిజాలు ఎంత మేరకు ఉన్నాయి అనేది కాలమే నిర్ణయించాలి మరి.

  English summary
  Comedian Pruthvi Raj To Join in Janasena, he announced after meeting nagababu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X