twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా తండ్రి ప్రోత్సహించలేదు అయినా.... : రఘుబాబు

    By Srikanya
    |

    Comedian Raghu Babu about his films
    నిడదవోలు : తాను సినీరంగంలోకి వచ్చేందుకు తన తండ్రి గిరిబాబు అంతగా ప్రోత్సాహం అందించలేదని ప్రముఖ హాప్యనటుడు యర్రా రఘుబాబు అన్నారు. తాను నా సొంత ప్రతిభతో సినీరంగ ప్రవేశం చేసి వివిధ విభిన్న పాత్రల ద్వారా మంచి గుర్తింపు పొందానన్నారు. నా తండ్రి గిరిబాబు నన్ను చూసి గర్వపడుతున్నానని చెప్పారన్నారు. నిడదవోలులో జరుగుతున్న వెంకటేశ్వర ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ చిత్రీకరణలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన నిడదవోలులో మీడియాతో మాట్లాడారు.

    తాను 1990లో దొంగలున్నారు జాగ్రత్త చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశానని, ఆ చిత్రం 1991లో విడుదలైందన్నారు. ఇంత వరకు తాను 250 వరకు చిత్రాల్లో నటించానన్నారు. అయితే ప్రతిభ అనేది సిలెండర్‌లో గ్యాస్‌ వంటిదని, ప్రతిభ ఉంటే గ్యాస్‌లాగే ఉన్నత స్థానానికి చేరి గుర్తింపు దానికదే వస్తుందన్నారు. తనను హాస్యరంగంలో ప్రేక్షకులే ప్రోత్సహిస్తున్నారని, వారి ప్రోత్సాహం ఉన్నంత వరకు మాలాంటి హాస్యనటుల ఎదుగుదల ఆగదన్నారు.

    ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న రేసుగుర్రం, ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న రభస, మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ఆగడు, అల్లరి నరేష్‌ హీరోగా నటిస్తున్న ఒక చిత్రం, వీవీ వినాయక్‌ దర్శకత్వంలో రానున్న చిత్రాల్లో నటించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం భీమవరం బుల్లోడు, పాండవులు పాండవుల తుమ్మెద చిత్రాల చిత్రీకరణ పూర్తయ్యి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

    ఎప్పుడూ మంచి హాస్యచిత్రాల్లో నటించి మంచి నటునిగా ప్రేక్షకుల గుండెల్లో నిలచిపోవాలనేది నా కోరిక అని రఘుబాబు అన్నారు. తాను 1964లో రావినూతలలో జన్మించినట్లు తెలిపారు. 1990లో దొంగలున్నారు జాగ్రత్త చిత్రంలో నటించిన అనంతరం లేడీడిటెక్టివ్‌, ముత్తయిదువ, వసంతకోకిల వంటి సీరియల్స్‌లో కూడా నటించానన్నారు. 2001లో విడుదలైన మురారి చిత్రం ద్వారా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఇంకా ఆది, చెన్నకేశవరెడ్డి, కబాడీ కబాడీ, బెట్టింగ్‌ బంగార్రాజు, ఖడ్గం, వేదం, యజ్ఞం చిత్రాల ద్వారా కూడా గుర్తింపు వచ్చిందన్నారు.

    2002లో నీతో చెప్పాలని, ఆది, భరత్‌సింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, జెమిని, ఖడ్గం చిత్రాలు, 2012లో పూలరంగడు, ఎందుకంట.., ప్రేమతో, దరువు, ఢమరకం చిత్రాలు, 2013లో మిర్చి, తడాఖా, ఓ మల్లి చిత్రాల్లో నటించానన్నారు. రానున్న రోజుల్లో మరింత మంచి పాత్రల్లో నటించి మరింత ప్రేక్షకాదరణ పొందుతానన్నారు. మంచి కథ ఉండి అవకాశం వస్తే దర్శకత్వం వహించాలనే ఆలోచన ఉందని రఘుబాబు అన్నారు.

    English summary
    Raghu Babu is a Telugu famous comedian well known for his comic expressions & timing in many successful films in Telugu industry, who is the elder son of famous comedian and character actor Giri Babu. He got married in 1988. He played a crucial role in comedy part in movies, establishing himself as the director's pick in several Telugu films. He is a Nandi Award nominee for a Telugu film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X