డైరెక్ట్ గా అమ్మాయికి లిప్ కిస్.. గుడ్ న్యూస్ చెప్పి షాక్ ఇచ్చిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రాహుల్ రామకృష్ణ రచయితగా కూడా కొన్ని సినిమాలకు వర్క్ చేయడం జరిగింది. అంతేకాకుండా పాటల రచయితగా కూడా కొన్ని సినిమాలకు వర్క్ చేశాడు. అయితే అతను ఇటీవల సోషల్ మీడియాలో విభిన్నమైన శైలిలో కాంట్రవర్సీ విషయాలపై కూడా స్పందిస్తున్నారు. ఇక రీసెంట్ గా డైరెక్ట్ గా ఒక అమ్మాయికి ముద్దు పెట్టేసి రాహుల్ రామకృష్ణ ఒక సంచలన విషయాన్ని తెలియజేశాడు. ఈ రేంజ్ లో ఎవరు కూడా ఆ విషయాన్ని తెలియజేయరు అని నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

కమెడియన్ గానే కాకుండా..

కమెడియన్ గానే కాకుండా..

పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన సైన్మా అనే షార్ట్ ఫిలిం ద్వారా బాగా క్రేజ్ అందుకున్న రాహుల్ రామకృష్ణ ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా తో ఒక కమెడియన్ గా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే అతను కేవలం కమెడియన్ పాత్రలు మాత్రమే కాకుండా విభిన్నమైన క్యారెక్టర్స్ లో కూడా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు.

RRR సినిమాలో

RRR సినిమాలో

గీత గోవిందంలో మరోసారి విజయ్ దేవరకొండ స్నేహితుడిగా కనిపించి మంచి గుర్తింపును అనుకున్నాడు. ఆ సినిమా తర్వాత రాహుల్ రామకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీ నటుడిగా మారిపోయాడు. రీసెంట్ గా వచ్చిన RRR సినిమాలో కూడా ఒక మంచి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ తో ఒక సీన్ లో అతను నటించిన విధానం ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

దర్శకులకు దగ్గరగా..

దర్శకులకు దగ్గరగా..

కేవలం నటుడుగానే కాకుండా రచయితగా కూడా అతను మంచి గుర్తింపు అందుకున్నాడు. రాహుల్ రామకృష్ణ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. అతని తెలివి నైపుణ్యం గురించి తెలుసుకున్న త్రివిక్రమ్ కూడా అతనికి మంచి మిత్రుడిగా మారిపోయాడు. అల వైకుంఠపురం సినిమాలో కూడా రాహుల్ రామకృష్ణ ఒక స్పెషల్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

కాంట్రవర్సీ ట్వీట్స్

కాంట్రవర్సీ ట్వీట్స్

అయితే ఇటీవల కాలంలో రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో ఎవరు ఊహించని విధంగా ట్వీట్స్ వేస్తూ ఉండడం విశేషం. ఎక్కువగా కాంట్రవర్సీ విషయాలపై కూడా రాహుల్ రామకృష్ణ చాలా ఓపెన్ గా కౌంటర్లు వేస్తున్నాడు. ఇటీవల ప్రముఖ మీడియా అలాగే విశ్వక్సేన్ కు మధ్య జరిగిన వివాదంపై కూడా రాహుల్ రామకృష్ణ హీరోకు మద్దతు ఇచ్చాడు. కావాలంటే నేను కూడా డిబేట్ కి వస్తాను అంటూ ఛాలెంజ్ కూడా విసిరాడు.

అర్జున్ రెడ్డి లాంటి ముద్దు

అర్జున్ రెడ్డి లాంటి ముద్దు

అయితే రాహుల్ రామకృష్ణ రీసెంట్ గా మరొక విషయాన్ని తెలియజేశాడు. ఒక అమ్మాయి డైరెక్ట్ గా అర్జున్ రెడ్డి లాంటి ముద్దు పెట్టిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇక ఫోటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రాహుల్ రామకృష్ణ వెబ్ సిరీస్ ఏమైనా చేస్తున్నాడా అనే కామెంట్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి.

అసలు విషయం ఏమిటంటే

అసలు విషయం ఏమిటంటే

అయితే ఎక్కువగా రూమర్స్ కు తావివ్వకుండా రాహుల్ రామకృష్ణ అసలు విషయాన్ని చెప్పేసాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తన ప్రేయసిని ఈ విధంగా పరిచయం చేశాడు. పెళ్లికి సిద్ధమవుతున్నాను అంటూ త్వరలోనే అని ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక వీరు దిగిన ఫోటోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో ఎప్పుడూ లేని విధంగా రాహుల్ రామకృష్ణ ఈ విధంగా పోస్ట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా అందమైన జీవితంతో హ్యాపీగా ఉండాలి అని కూడా నెటిజన్లు విషెస్ అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X