హాస్యనటుడు రామ్మూర్తి మృతి

పరిచయస్ధులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు అయ్యే వరకూ రామ్మూర్తి అన్ని కార్యక్రమాలకు అటెండయ్యేవారు. దగ్గరుండి తన భాద్యతగా భావించి చివరి వరకూ ఉండేవారు. దాంతో ఆయన మరణించారని తెలియగానే స్ధానికులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. రామ్మూర్తి 1999 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సనత్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసి ఓడిపోయారు. నటుడు శ్రీహరి ఆయన అంత్యక్రియలకు అటెండయ్యారు. ఎంతో భవిష్యత్ ఉన్న రామ్మూర్తి అంత త్వరగా అందరినీ విడిచిపెట్టి వెళ్ళటం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కావాలని దట్స్ తెలుగు కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications











