కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి పేరుతో మోసం.. గుట్టు రట్టు చేసిన పోలీసులు!

Recommended Video

Man Creates Fake Account On Comedian Srinivas Reddy's Name

టాలీవుడ్ కమెడియన్ శ్రీనివాస రెడ్డి ఇటీవల గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా వంటి చిత్రాలలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా శ్రీనివాస్ రెడ్డి బిజీగా నటిస్తున్నాడు. సెలెబ్రెటీలకు సైబర్ క్రైమ్ నేరగాళ్ల నుంచి ఎప్పుడూ తిప్పలు తప్పవు. శ్రీనివాస్ రెడ్డి కూడా ఆ పరిస్థితి ఎదుర్కొన్నాడు. కమెడియన్ శ్రీనివాస్ రెడీ పేరు మీద నకిలీ పేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన ఓ సహాయ దర్శకుడు అనేక మోసాలకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

 కో డైరెక్టర్

కో డైరెక్టర్

టాలీవుడ్ లో కో డైరెక్టర్ గా పనిచేస్తున్న రవి కిరణ్ అనే వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి పేరిట నకిలీపేస్ బుక్ ఖాతా తెరిచినట్లు తెలియడంతో శ్రీనివాస్ రెడ్డి ఇంటీవల పోలీస్ కంప్లైన్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో సైబర్ డిపార్ట్మెంట్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.

గుట్టు రట్టు

గుట్టు రట్టు

పోలీసులు ఈ నకిలీ ఖాతా తెరిచింది రవికిరణ్ అనే కో డైరెక్టర్ అని అతడి గుట్టు రట్టు చేశారు. తాను శ్రీనివాస్ రెడ్డిని అని నమ్మించి పలువురిని మోసం చేసిన ఘటనలని పోలీసులు వెలుగులో తీశారు.

 కేరళ వరద బాధితుల కోసం

కేరళ వరద బాధితుల కోసం

తనతో చాటింగ్ చేసేవారికి తాను శ్రీనివాస్ రెడ్డినే అని నమ్మించాడు. తాను కేరళ వరద బాధితుల కోసం విరాళాలు సేకరిస్తున్నా అని కొంత మంది దగ్గర రూ 5 వేల వరకు డబ్బుని తన అకౌంట్ లో జమ చేయించుకున్నట్లు పోలీసులు గ్రహించారు.

డబ్బు కోసమే

డబ్బు కోసమే

అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేవలం డబ్బు కోసమే ఈ మోసానికి పాల్పడ్డాడని, అనుమానం రాకుండా ఉండేందుకు శ్రీనివాస్ రెడ్డి పేరు వాడుకునట్లు పోలీసులు చెబుతున్నారు. దీనితో పోలీసులు రవికిరణ్ తో శ్రీనివాస్ రెడ్డికి క్షమాపణ చెప్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X