Don't Miss!
- News డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్‌పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
బ్రేకింగ్ న్యూస్.. ఎన్టీఆర్ టైటిల్‌ను కొట్టేసిన సప్తగిరి!
సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని, మార్కెట్‌ని సొంతం చేసుకున్నారు టాప్ కమెడియన్ సప్తగిరి. ఆయన హీరోగా గజదొంగ పేరుతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనుంది. నంద నందనా ప్రాజెక్ట్స్ పతాకంపై శర్మ చుక్కా, యెడల నరేంద్ర, జీవీఎన్ రెడ్డి చిత్రాన్ని నిర్మించనున్నారు. గీతా ఆర్ట్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థల్లో దర్శకత్వ శాఖలో పనిచేసిన డి.రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
నిర్మాతలు శర్మ చుక్కా, యెడల నరేంద్ర, జీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ సప్తగిరికి యాప్ట్ సబ్జెక్ట్ ఇది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మహానటుడు ఎన్టీఆర్ నటించిన గజదొంగకూ, దీనికీ సంబంధం లేదు. ఇందులో సప్తగిరిది దొంగలకు దొంగలాంటి పాత్ర. అసలు సిసలు దొంగల్ని దోచుకుని సమాజానికి ఉపయోగపడే దొంగగా కనిపించనున్నాడు. విలేజ్, టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఆగస్టు తొలి వారంలో చిత్రీకరణ మొదలుపెడతాం అని తెలిపారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రవీణ్ వనమాలి, సంగీతం:బుల్గానిన్, ఆర్ట్ : వర్మ,మూల కథ-రచనా సహకారం: జీటీఆర్ మహేంద్ర, పీవీ సతీష్, లైన్ ప్రొడ్యూసర్: ఆర్ వీవీవీ ప్రసాద్, నిర్మాతలు: శర్మ చుక్కా, యెడల నరేంద్ర , జీవీఎన్.రెడ్డి , కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: డి.రామకృష్ణ.