twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాస్యనటుడు శివారెడ్డి పెళ్ళి

    By Staff
    |

    Sivareddy
    సిద్దిపేట: హాస్య నటుడు శివారెడ్డి ఆదివారం ఓ ఇంటివాడయ్యాడు. ప్రపంచ నవ్వుల దినం నాడు ఆయన పెళ్ళి చేసుకోవడం విశేషం. మెదక్‌ జిల్లా సిద్దిపేటలోని సీసీ గార్డెన్స్‌లో తిరుపతిరెడ్డి కుమార్తె స్వాతితో ఆయన వివా హం వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సినీరంగ ప్రముఖులు మురళీమోహన్‌, బ్రహ్మనందం, అలీ, ఏవీఎస్‌, గుండు హనుమంతరావు, జయలలిత, చిట్టిబాబు, అనంత్‌, గౌతమ్‌రాజు హాజరయ్యారు.

    ఒక్కసారిగా పలువురు నటులు వివాహం వద్ద కనిపించడంతో పిల్లలు, యువకులు వారి ఆటోగ్రాఫ్‌లు, ఫోటోల కోసం ఆ రాటపడ్డారు. ప్రపంచ నవ్వుల దినోత్సవంరోజున తన పెళ్లి జరగడం ఎంతో సంతోషంగా ఉందని శివారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అక్కడ కూడా అభిమానులు ఆయనను మిమిక్రీ చేయందే వదల్లేదు. వారి కోరిక కాదనలేని ఆయన, ఆర్టీసీ చైర్మన్‌ ఎం. సత్యనారాయణ, రాజశేఖరరెడ్డి, చంద్రబాబులను అనుకరించి నవ్వులు పూయించారు.

    వాస్తవానికి తాను మారిషస్‌ వెళ్లాల్సిఉందని, నవ్వుల దినో త్సవ ముహూర్తం బాగుందనడంతో పెళ్లి చేసేసుకున్నానని చెప్పాడు. శివా రెడ్డితో వివాహం ఎంతో ఆనందం కలిగిస్తున్నదని, తమ వైవాహిక జీవితం నవ్వులా నావలా సాగిపోతుందన్న నమ్మకం ఉందని నవ వధువు స్వాతి హర్షం ప్రకటించింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X