కమిడియెన్ శ్రీనివాస రెడ్డి హీరోగా పెద్ద నిర్మాత

By Srikanya

హైదరాబాద్ : మరో హాస్య నటుడు హీరోగా తెరంగ్రేటం చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని సమాచారం. ఓ కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీ విన్న బెల్లంకొండ ఇంప్రెస్ అయ్యి ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు తెలుస్తోంది. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంబించిన శ్రీనివాస రెడ్డి తర్వాత కాలంలో శ్రియ మొదటి చిత్రం ఇష్టం చిత్రంతో కమిడియెన్ గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత చాలా సినిమాలు చేసారు. దాదాపు పెద్ద హీరోలందిరితో చేసారు. ఈ మధ్య కాలంలో నారా రోహిత్ తో చేసిన సోలో ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో శ్రీనివాస రెడ్డి దృష్టిలో పెట్టుకుని కథ రెడీ చేసుకుని ఓ దర్శకుడు హీరోగా లాంచ్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తి వివరాలతో త్వరలో ప్రకటన రానుందని సమాచారం.

ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ ...సమంత,సిద్దార్ధ కాంబినేషన్ లో ఓ చిత్రం చేస్తున్నారు. అలా మొదలైంది దర్శకురాలు నందినీరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం మొదలై షూటింగ్ జరుపుంటోంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం షూటింగ్ గతంలోనే ప్రారంభం కావాల్సి ఉండగా.....డేట్స్ అడ్జెస్ట్‌మెంట్ విషయంలో బెల్లకొండ సురేష్ కి సమంతకి మధ్య విబేధాలు రావడంతో సినిమా షూటింగ్ లేటవుతూ వచ్చింది. విషయం ఫిల్మ్ ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకు వెళ్లింది. డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని బెల్లకొండ ఫిర్యాదు చేస్తే....షూటింగ్ డేట్స్ ముందే ఖరారు చేయక పోవడంతో నేను వేరే సినిమాలకు కమిట్ అయ్యానని సమంత వాదించింది. ఎట్టకేలకు ఇరువురి మధ్య రాజీ కుదరడంతో వివాదం సద్దుమనిగింది.

అంతేగాక నాగచైతన్య, సునీల్‌ హీరోలుగా శ్రీసాయి గణేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వాళ్లిద్దరూ అన్నదమ్ములుగా చేస్తున్నారు. తమిళ హిట్ వెట్టై రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం భలే తమ్ముడు టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన తమన్నా, సునీల్ సరసన ఆండ్రియాలు హీరోయిన్స్ గా చేస్తున్నారు. కొచెం ఇష్టం..కొంచెం కష్టం తో పరిచయమైన పి.కిశోర్‌కుమార్‌ (డాలీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాతలు.

ఇక రీసెంట్ గా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్, హన్సిక జంటగా ఎం. రాజేష్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'ఓకే ఓకే' చిత్రం తెలుగులో అదే పేరుతో విడుదల చేసారు . మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌ బాబు ఈ చిత్రాన్ని అనువదించారు.. ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల చేస్తే మంచి టాక్ తెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X