కమెడియన్ శ్రీనివాసరెడ్డికి 'మళ్లీ పెళ్లి'?: ఆ ఫోటోతో పెద్ద షాక్ ఇచ్చాడు..

అదేంటి.. మొన్నీమధ్యే కదా! కమెడియన్ శ్రీనివాసరెడ్డికి రెండో కుమార్తె పుట్టిందని వార్తలు వచ్చాయి. ఇంతలోనే అతనికి మళ్లీ పెళ్లి ఏంటి అని ఆశ్యర్యపోతున్నారా?.. మరి మనోడు ఇచ్చిన షాక్ అలా ఉంది. 'మళ్లీ పెళ్లి' అంటూ ట్విట్టర్ లో శ్రీనివాసరెడ్డి పోస్ట్ చేసిన ఫోటో చాలామందిని ఆశ్చర్యపోయేలా చేసింది. కానీ అసలు విషయమేంటంటే..

అసలు విషయం ఇదీ..:

అసలు విషయం ఇదీ..:

శ్రీనివాసరెడ్డి తాజాగా పోస్ట్ చేసిన ఫోటో తన పర్సనల్ లైఫ్ కి సంబంధించింది కాదు. తను తాజాగా చేస్తున్న 'జంబలకిడి పంబ' సినిమాలోని ఓ సన్నివేశానికి సంబంధించింది. ఈ విషయాన్ని శ్రీనివాసరెడ్డి సూటిగా చెప్పకుండా.. 'మళ్లీ పెళ్లి' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి భలే షాక్ ఇచ్చాడు.

జంబలకిడి పంబ రీమేక్..:

జంబలకిడి పంబ రీమేక్..:

1993లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన జంబలకిడిపంబ సినిమా ప్రేక్షకులను ఎంతగా నవ్వించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ టీవీలో ఆ సినిమా వచ్చిన చాలామంది పడి పడి నవ్వుతుంటారు. అలాంటి సినిమాను ఇప్పుడు మళ్లీ రీమేక్ చేయబోతుండటం విశేషం.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్

జంబలకిడి పంబ కాన్సెప్టును ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసి తెరకెక్కించబోతున్నారు. .రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ పై మను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

రెగ్యులర్ షూటింగ్:

రెగ్యులర్ షూటింగ్:

శ్రీనివాస‌రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆ తర్వాత ఈస్ట్ గోదావ‌రి, వైజాగ్‌, అర‌కు, కేర‌ళ‌లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తారు. మార్చి 10 వ‌ర‌కు సాగే రెగ్యులర్ షూటింగ్ తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తవుతుందని తెలుస్తోంది.

శ్రీనివాసరెడ్డి ఊపు మీదున్నాడు..:

శ్రీనివాసరెడ్డి ఊపు మీదున్నాడు..:

'గీతాంజలి' 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా' వంటి సినిమాలతో హీరోగానూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డికి ఈ సినిమా కెరీర్ టర్నింగ్ అయ్యే అవకాశాలున్నాయి. జంబలకిడిపంబ రీమేక్ బంపర్ హిట్ అయితే హీరోగా ఆయనకు మరిన్ని అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం.

మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారా?:

మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారా?:

ఇండస్ట్రీలో క్లాసిక్ సినిమాలుగా నిలిచిపోయిన వాటిని టచ్ చేయడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి. చాలా సందర్భాల్లో అనవసరంగా సినిమా చెడగొట్టారన్న విమర్శలు మూటగట్టుకున్న దర్శకులు ఉన్నారు.

తెరపై అద్భుతంగా ఆవిష్కృతమైన సన్నివేశాలను మరోసారి రిపీట్ చేయడమంటే మామూలు విషయం కాదు. ఈ లెక్కన శ్రీనివాసరెడ్డి&టీమ్ పెద్ద సాహసమే చేస్తున్నారనాలి. చూడాలి మరి.. విమర్శలు మూటగట్టుకుంటారో.. లేక విమర్శకుల ప్రశంసలు పొందుతారో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X