కమిడియన్ 'సుధాకర్' కండీషన్ సీరియస్..ఐసియులో
భిష అంటూ విచిత్రమన లాగ్వేజి ఉపయోగిస్తూ తెగ నవ్వించే కమిడియన్ సుధాకర్ ఆరోగ్య పరిస్దితి బాగుండకపోవటంతో హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో మూడు రోజుల నుంచీ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. మొదట ఫిట్స్ కనపడిన ఆయన ఆరోగ్యం అంతకంతకీ మందగించటంతో ఐసియు లో పెట్టారు. లోపల ఉన్న ఆయన ఆర్గాన్స్ పాడయిపోవటంతో రక్త పోటు అధికంగా ఉందని వైధ్యులు తెలిపారు. వెంటిలేటర్ సాయింతో శ్వాస తీసుకుంటున్నారని సమాచారం. రెండు రోజుల క్రితం వరకూ వాళ్ళవారితో మాట్లాడారని ప్రస్తుతం అదీ లేదని చెప్తున్నారు.
ఇక కెరీర్ పరంగా సుధాకర్..కేవలం ఓ టీవీ ఛానెల్ వారి రికార్డడ్ పోగ్రామ్ లో తప్ప వేరే చోట కనిపించటంలేదు.చిరంజివితో కెరిర్ ప్రారంభించి ఆయనకే ఒకప్పుడు పోటీ ఇచ్చిన ఆయన కెరీర్ అస్సలు నామరూపాలు లేకుండా పోయింది. అంత టాలెంటు ఉన్న అతనికి ఎందుకు అవకాశాలు కరువయ్యాయి అంటే కేవలం త్రాగుడేనని చెప్తారు. అలాగే ఆ మధ్య తాను తీసిన చిన్న సినిమాలకు ధియోటర్లు దొరకకుండా అల్లు అరవింద్ అడ్డుపడ్డారని హాస్య నటుడు సుధాకర్ ఆరోపించటం కూడా తెలిసిందే. అలాగే చిరంజీవి, తాను మంచి స్నేహితులమని, తన కోసం యముడుకు మొగుడు చిత్రాన్ని చేసామని సుధాకర్ చెప్తూంటారు. కెరీర్ పరంగానూ, ఆరోగ్య పరంగానూ బాగా దెబ్బతిన్న సుధాకర్ త్వరగా కోలుకోవాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications











