హాస్య నటుడు సుధాకర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి?
కోమాలోకి వెళ్ళిన హాస్య నటుడు సుధాకర్ పరిస్ధితి ఇంకా విషమంగానే ఉంది. కొద్ది రోజుల క్రిందట ఫిట్స్ వచ్చి హైదరాబాద్ కేర్ హాస్పటిల్ లో చేరిన సుధాకర్..గత కొంత కాలంగా కాలేయ కాన్సర్ తో భాధపడుతున్నారు. ఈ ఆదివారం నాడు మూత్రపిండాలు పనిచేయక బీపీ అధికమై ఐసియులో పెట్టారు. మొదట 48 గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమన్న డాక్టర్లు మరో 24 గంటలు గడిస్తే గానీ ఏ విషయం నిర్ధారించలేమంటున్నారు. ఆయన శరీరానికి పూర్తిగా ఇన్‌ఫెక్షన్ సోకడంతో వైద్యానికి స్పందించడం లేదన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications











