కమేడియన్ సునీల్ కు బలుపెక్కువయిందా??
కమేడియన్ సునీల్ బరువు తగ్గి సన్నబడ్డా బలుపెక్కువయింది అనుకుంటున్నారట సినీజనాలు. ఎన్నో సినిమాల్లో కమేడియన్ గా నటించి ప్రేక్షకుల మనసులో మంచి స్థానం సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో కూడా మంచి వ్యక్తి అని పేరుతెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్యన ఏ దర్శకనిర్మాతలైనా సునీల్ ని డేట్స్ అడగటానికి వెళ్తే సారీ డేట్స్ కుదరటం లేదని అంటున్నాడట. దీంతో సదురు దర్శకనిర్మాతలు సునీల్ కు బాగా బలుపెక్కువయింది. హీరోగా చేస్తున్నాడు కదా అందుకే లెవల్ కొడుతున్నాడు అని ప్రచారం చేస్తున్నారట.
కానీ సునీల్ మాత్రం తాను హీరోగానే కొనసాగాలని అనుకోవడం లేదని, రాజమౌళి 'మర్యాద రామన్న' సినిమాకు ఎక్కువ డేట్స్ కేటాయించడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందనీ, దయచేసి నన్ను అర్థం చేసుకోండని, తన గురించి తప్పుగా ప్రచారం చెయ్యద్దని విన్నవించుకుంటున్నాడు. సరైన కారణమే కదా!!


Click it and Unblock the Notifications











