కామిడీ హీరో ‘సునీల్’ బికినీలో!
'మగధీర" సినిమా సక్సెస్ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మర్యాద రామన్న". ఈ చిత్రం రాయలసీమ ప్ర్యాక్షనిజం బ్యాక్ గ్రౌండ్ తో రూపొందుతున్న చిత్రం ఫుల్ కామిడి ఎంటర్ టైన్ మెంట్ గా రూపొందించ బడుతున్నది. ఈ చిత్రంలో సునీల్ హీరోగా సలోని హీరోయిన్ గా నటిస్తున్నారు. కమెడియన్లు ఒంటిమీద చీర చుడితే ప్రేక్షకులకు అదో కిక్. రాజేంద్రప్రసాద్, నరేష్, ఆలీ, వంటి పలువురు కామిడి యాక్టర్స్ చీర కట్టుకొని నవ్వులు పూయించిన వారే. నలుగురూ నడిచిన రూట్లో నటిస్తే గొప్పుముంది. కమెడియన్లలో తన కంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చుకొన్న సునీల్ ఇప్పుడు బికినీ లో ప్రదర్శనాలివ్వటానికి సిద్దమౌతున్నారట. అందాల రాముడు చిత్రం తర్వాత సునీల్ రెండో సారి హీరోగా నటిస్తున్న 'మర్యాద రామన్న" చిత్రంలోని ఓ సాంగ్ లో సునీల్ బికినీ అందాలు ప్రదర్శించబోతున్నట్టు సమాచారం.
సునీల్ క్యారెక్టర్లన్నీ కామెడీతో అనుసంబంధానమై హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. ఇంతవరకూ పూర్తి స్థాయి కామెడీ చిత్రాలకు పనిచేయని ప్రముఖ దర్శకుడు రాజమౌళి. ఇందులో బ్రహ్మనందం, నాగినీడు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి యం యం కీరవాణి మంచి సంగీతాన్ని అందించారు. స్టోరి ఎస్ ఎస్ కంచి. ఈ చిత్ర రెగ్యులర్ ష్యూటింగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభంకానుంది.


Click it and Unblock the Notifications











