సునీల్ హీరోగా రాజమౌళి సినిమా!!

'అందాల రాముడు'తో తాను కామెడీ హీరోగానూ పనికొస్తానని సునీల్ ఇప్పటికే నిరూపించుకున్నాడు. అయితే రాజమౌళి దర్శకత్వ బాణీ వేరు కాబట్టి ఈ సినిమాతో సునీల్ మెయిన్ స్ట్రీమ్ హీరోగా మారినా ఆశ్చర్య పోనవసరం లేదు. రాజమౌళి వంటి టాప్ డైరెక్టర్ తనను హీరోగా ఎంచుకోవడం పట్ల సునీల్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. సునీల్ సినిమా తర్వాత ప్రభాస్‌ని డైరెక్ట్ చేయనున్నాడు రాజమౌళి. ఈ సినిమాను వరస యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్న రాజమౌళి రిలాక్స్ కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
అయినా రాజమౌళి సినిమాల్లో కామిడీ బాగానే పండుతుంది కాబట్టి కాంబినేషన్ గ్యారింటి హిట్ అంటున్నారు. అయితే సురేంద్రరెడ్డి అప్పట్లో సునీల్ తో బంతి సినిమా చేస్తానన్నాడు. కాని ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. దాంతో ఇప్పుడు ఈ సనిమా పట్ల కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాంటేమి జరగదని ఆశిద్దాం. ఇక ఈ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేసి 2009 వేసవిలో విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











