జయరాం హత్య కేసులో యంగ్ కమెడియన్ అరెస్ట్.. పెరుగుతున్న అనుమానాలు!

ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత జయరాం చిగురుపాటి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. జయరాం మేనకోడలు యాంకర్ శిఖా చౌదరి, ఆమెకు పరిచయం ఉన్న రాకేష్, మరికొంతమంది ప్రమేయం ఈ హత్యలో ఉన్నట్లు పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు. జయరాం హత్యకు సంబంధించి అతడి మేనకోడలు శిఖా చౌదరిని కూడా పోలీసులు ఇటీవల విచారించిన సంగతి తెలిసిందే. పలు చిత్రాల్లో హీరో స్నేహితుడిగా, కమెడియన్ గా నటించిన సూర్య ప్రసాద్ ప్రమేయంపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సూర్య ప్రసాద్ అరెస్ట్

సూర్య ప్రసాద్ అరెస్ట్

జయరాం హత్యకు సంబంధించిన విషయం సూర్య ప్రసాద్ కు తెలుసు అని, జయరాం మృతదేహాన్ని సూర్య ప్రసాద్ తో పాటు అతడి అసిస్టెంట్ కిషోర్, అంజిరెడ్డి చూశారని అయినా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో అనుమానాలు పోలీసుల్లో బలపడ్డాయి. దీనితో సూర్య ప్రసాద్ ని పోలీసులు విచారించారు. అతడి నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో విచారణ వేగవంతం చేసేందుకు సూర్య ప్రసాద్ ని తాజాగా అరెస్ట్ చేశారు. త్వరలో అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

పిడిగుద్దులు

పిడిగుద్దులు

రాకేష్ నివాసంలోనే జయరాం హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జయరాం, రాకేష్ మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదంలో రాకేష్ జయరాంని బలంగా పిడిగుద్దులు గుద్దడంతో ఆయన మరణించినట్లు పోలీసులు ఓ అంచనాకు వస్తున్నాయి. ఈ హత్యలో రాకేష్ కు సూర్య ప్రసాద్, కిషోర్, అంజి రెడ్డి ఏవిధంగా సహకరించారనే విషయం తేలాల్సి ఉంది.

గుట్టుచప్పుడు కాకుండా

గుట్టుచప్పుడు కాకుండా

జయరాంని హత్య చేసిన తర్వాత ఆయన మృతదేహాన్ని నందిగామ వద్ద రోడ్డు పక్కన కారులు ఉంచి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. జయరాం హత్య జరిగిన తర్వాత అయన మేనకోడలు శిఖా చౌదరి, రాకేష్ ల కాల్ డేటాని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ హత్యలు రాకేష్ ప్రమేయం ఉందనేది అంతా బలంగా నమ్ముతున్న విషయం. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలని బయటకు లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

హత్యకు కారణం

హత్యకు కారణం

జయరాంని రాకేష్ హత్య చేయడానికి డబ్బే కారణమా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జయరాం మృతదేహాన్ని చూసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే ప్రశ్నలు సూర్య ప్రసాద్ కు ఎదురవుతున్నాయి. జయరాం హత్యకేసులో ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X