పాపం..సుత్తివేలుకూ బంద్ కష్టాలు
'జై షిర్డీ సాయిరాం' షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌లో బస్సు ఎక్కిన హాస్య నటుడు సుత్తివేలు నిన్న(గురువారం) కొండమల్లేపల్లి వద్ద తెలంగాణ ఉద్యమకారుల పాలిట పడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగే ఈ షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్ నుంచి ఆయన అక్కడికి వెళ్తున్నారు. ఈ లోగా ఆయన ప్రయాణిస్తు న్న బస్సును వారు నిలిపేసి విధ్వంసానికి పాల్పడ్డారు. అప్పుడు సుత్తివేలు క్రిందకి దిగి తన అవసరం చెప్పి వాళ్లని బతిమిలాడారు, కానీ వర్కవుట్ కాలేదు. బస్సును ముందుకు కదలనిచ్చేది లేదని వారు మొండికేయడంతో ఎలాగోలా ఒక లారీ కదిలించేలా ఒప్పించి ఎక్కారు. గుంటూరు వరకు వెళ్తున్న ఆ లారీలోనే సుత్తివేలు ప్రయాణించక తప్పలేదు. మధ్యాహ్నమైంది..తెలంగాణ బంద్ జరుగుతుండడంతో నాగార్జునసాగర్ వరకు ఒక్క హోటల్ కూడా తెరవలేదు. అసలే ఆకలితో ఉన్న ఆయన మాచర్లలో దిగగానే పాత్రికేయులు, జనం వెంటపడుతుండగా ముందు ఆకలి తీర్చుకోనీయండి బాబూ అంటూ ఓ కాకాహోటల్ కు వెళ్లి భోజనం చేసారు. అలా తనను తెలంగాణా బంద్ తిప్పలు తెచ్చిపెట్టాయని ఆయన మీడియాతో అనంతరం వివరించారు.


Click it and Unblock the Notifications











