వేణు మాధవ్‌కు ఎన్టీఆర్ మొట్టికాయలు.. ఏ విషయంలో తెలుసా?

ప్ర‌ముఖ హాస్య న‌టుడు వేణు మాధ‌వ్ బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానలో అనారోగ్యం కార‌ణంగా మరణించిన సంగ‌తి తెలిసిందే. దాంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు పలువురు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. కాగా వెండి తెరపైన ఎలా రాణించారో.. అలాగే రాజకీయాల్లో కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. ఆయనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కలలు కనేవారని టీడీపీ వర్గాలు చెప్పుకొంటాయి. ఆయన జీవితంలోని కొన్ని ఘటన గురించి మీ కోసం..

టీడీపీ ఆఫీస్‌లో

టీడీపీ ఆఫీస్‌లో

మిమిక్రీ ఆర్టిస్టుగా స్థిరపడే క్రమంలో వేణు మాధవ్ పార్ట్ టైమ్‌ జాబ్స్ చేస్తూ హైదరాబాద్‌లో కాలం వెళ్లదీసేవారు. ఆ క్రమంలో ఆయన హిమయాత్‌నగర్‌లోని తెలుగు దేశం పార్టీ ఆఫీస్‌లో టెలిఫోన్ ఆపరేటర్‌గా పనిచేసే వాడినని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. టీడీపీ కార్యాలయంలో పనిచేసే సమయంలో దివంగత ఎన్టీఆర్, మాజీ సీఎం చంద్రబాబు, ఇతర నేతలతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ప్రతీ ఒక్కరికి తలలో నాలికలో ఉండేవారని చెప్పుకొంటారు.

ఎన్టీఆర్ మొట్టికాయ

ఎన్టీఆర్ మొట్టికాయ

ఇక టీడీపీ ఆఫీస్‌లో పనిచేసే సమయంలో ఓ సరదా సంఘటనను గత ఇంటర్వ్యూలో వేణుమాధవ్ వెల్లడించారు. ఎన్టీఆర్ చేత మొట్టికాయాలు తిన్నానని.. ఉదయం పూట గుమ్మంలో లైట్ వెలుగుతుండటంపై ఆయన చివాట్లు పెట్టారని చెప్పుకొచ్చారు. మనం సృష్టించలేని వాటిని దుబారా చేయవద్దని ఎన్టీఆర్ సలహా ఇచ్చారని వేణు మాధవ్ చెప్పారు.

Recommended Video

#RIPVenuMadhav : Comedian Venu Madhav Is No More
పార్టీ కార్యక్రమాల్లో

పార్టీ కార్యక్రమాల్లో

అలా తెలుగు దేశం పార్టీకి చేరువైన వేణు మాధవ్ టీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వారు. ఎన్నికల ప్రచారంలోను. పార్టీ సమావేశాల్లో అందరిని హుషారెత్తిస్తూ సందడి చేసే వారు. అలా పార్ట పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి వేణు మాధవ్ విశేషంగా కృషి చేశారని పార్టీ వర్గాలు చెప్పుకొంటారు. పార్టీకి విధేయుడిగా ఎన్నో రకాలుగా సేవలందించారు.

కోదాడ టికెట్ కోసం..

కోదాడ టికెట్ కోసం..

ఇక గత దశబ్ద కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించాలని వేణు మాధవ్ ప్రయత్నించారు. టీడీపీపై కోదాడ టికెట్‌ను ఆశించారు. అప్పటి పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల టీడీపీ అతడికి టికెట్ నిరాకరించింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారని పార్టీ వర్గాలు చెప్పుకొంటారు. అలా తన జీవితంలో ఎన్నికల్లో పోటీ చేయడం అనే అంశం తీరని కలగా మిగిలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X