మిమిక్రీ నుంచి మౌలాలి మెగాస్టార్‌గా వేణుమాధవ్.. చిరంజీవి, పవన్‌కు అతి సన్నిహితంగా

హాస్య నటుడు వేణుమాధవ్ మృతితో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీతో మమేకమైన వేణు మాధవ్ ఇక లేరనే వార్తతో శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలుచుకొని సహచర కళాకారులు కన్నీరుమున్నీరవుతున్నారు. మంగళవారం వేణు మాధవ్ ఆరోగ్యం విషమించిదనే వార్తలతో అభిమానులు కలత చెందారు. చివరకు బుధవారం మధ్యాహ్నం 12 గంటల 21 నిముషాలకు మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు, హాస్పిటల్ వైద్యులు ధ్రువీకరించారు.

బాల్యం నుంచే మిమిక్రి ప్రతిభతో

బాల్యం నుంచే మిమిక్రి ప్రతిభతో

బాల్యం నుంచే మిమిక్రీ కళాకారుడిగా వేణు మాధవ్ విశేషంగా రాణించారు. పలు కార్యక్రమాల్లో వేణు మాధవ్ మిమిక్రీ ప్రతిభను చూసిన సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఓ సభలో వేణు మిమిక్రీ, అభినయాన్ని చూసిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కడుపు చెక్కలయ్యేలా నవ్వారట. ఆ తర్వాత సంప్రదాయం అనే చిత్రంలో తొలిసారి అవకాశం కల్పించడంతో స్టార్ కమెడియన్‌గా మారారు. అంతేకాకుండా తాను నివసించే మౌలాలికి తానే మెగాస్టార్ అని పలు సందర్భాల్లో చెప్పుకోవడం ఆయన హాస్యచతురతకు నిదర్శనం.

Recommended Video

#RIPVenuMadhav : Comedian Venu Madhav Is No More
స్టార్ కమెడియన్‌గా బిజీ బిజీ

స్టార్ కమెడియన్‌గా బిజీ బిజీ

ఓ దశలో స్టార్ కమెడియన్‌గా షిప్టుల ప్రకారం నటించిన సందర్భాలు ఉన్నాయని తోటి నటులు చెప్పుకొంటారు. వేణు మాధవ్ డేట్స్ కోసం నిర్మాత, దర్శకులు వెయిట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి డిమాండ్ ఉన్న వేణు మాధవ్ ఆరోగ్యం సహకరించకపోవడంతో సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. పలు మార్లు వేణు మాధవ్ ఇక లేరనే వార్తలు మీడియాలో వస్తే.. ఆయన బహిరంగంగా స్పందించారు.

మా సభ్యుల పరామర్శ

మా సభ్యుల పరామర్శ

వేణు మాధవ్ ఆరోగ్యం విషమించిందనే సమాచారం అందుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) జనరల్ సెక్రటరి జీవిత రాజశేఖర్‌, నటులు ఉత్తేజ్, మా సభ్యుడు సురేష్ కొండేటి, టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ తారలు యశోదా హాస్పిటల్‌లో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తీరని లోటని సినీ ప్రముఖులు

తీరని లోటని సినీ ప్రముఖులు


సినీ పరిశ్రమలో ఎలాంటి కార్యక్రమం జరిగినా చలాకీగా వేణు మాధవ్ వ్యవహరిస్తూ సందడి చేసేవారు. పెద్ద, చిన్నా అనే తేడా లేకుండా సహనటులకు చేరువయ్యారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని ఎంతగానో అభిమానించే వారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో మంచి అనుబంధం ఉండేది. ఈ క్రమంలో వేణు మాధవ్ మృతి తీరని లోటని పలువురు పేర్కొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X