కమెడియన్ వేణుమాధవ్ పరిస్థితి విషమం.. షాక్‌లో ఫ్యాన్స్, సినీ ప్రముఖులు

Recommended Video

తెలుగు కమెడియన్ వేణుమాధవ్ కి తీవ్ర అస్వస్థత

తెలుగు చిత్రసీమలో కమెడియన్ గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ పరిస్థితి విషయంగా మారింది. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేణు మాధవ్ పరిస్థితి విషమంగా మారడంపై సినీ ప్రముఖులు, సహచర నటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులు ఏమని చెప్పారంటే..

కాలేయ సమస్యతో వేణు మాధవ్

కాలేయ సమస్యతో వేణు మాధవ్

ప్రస్తుతం నటుడు, కమెడియన్‌ వేణు మాధవ్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్య తీవ్రతరం కావడంతో సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో చేర్పించారు. గత కొద్ది రోజులుగా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

వెంటిలెటర్‌పై చికిత్స

వెంటిలెటర్‌పై చికిత్స

అయితే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాంతో వెంటిలేటర్‌తో చికిత్స అందిస్తున్నాం. ఆయన ఆరోగ్యం కుదటపడేలా చర్యలు తీసుకొంటున్నాం అని వైద్యులు వెల్లడించారు.

మిమిక్రీ ఆర్టిస్టు నుంచి సినీ రంగంలోకి

మిమిక్రీ ఆర్టిస్టు నుంచి సినీ రంగంలోకి

ఇక వేణు మాధవ్ సినీ రంగంలోకి రాకముందు తెలుగు దేశం పార్టీ ఆఫీస్‌లో పనిచేస్తూనే మిమిక్రీ ఆర్టిస్టుగా కొనసాగారు. ఆ తర్వాత ఆయన సంప్రదాయం అనే చిత్రంతో సినీ రంగానికి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ అగ్ర హీరోల సరసన నటించాడు. గత కొద్దికాలంగా ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నాడు.

సినీ ప్రముఖులు ఆందోళన

సినీ ప్రముఖులు ఆందోళన

ఇక హీరోగా వెండితెరపై వేణు మాధవ్ తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. హంగామా, భూకైలాస్, ప్రేమాభిషేకం చిత్రాల్లో హీరోగా నటించారు. అలాగే పలు టెలివిజన్ సీరియల్స్‌లో హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని సన్నిహితులు, బంధువులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X