టాలీవుడ్ పాపులర్ కమేడియన్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలు...!?
ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ ఈ రోజు తీవ్ర అస్వస్థతకి గురై..అసుపత్రి పాలయ్యారు. ఇంటి నుండి షూటింగ్ కి బయలుదేరుతున్న సమయంలో ఆయనకి తీవ్ర స్థాయిలో కడుపు నొప్పి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ కొత్త పేటలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్సించారు. గత కొంత కాలంగా వేణు మాధవ్ ఇలా కడుపు నొప్పితో బాధ పడుతున్నట్టు మిత్రులు చెప్పడంతో అన్ని వైద్య పరీక్షలు అనంతరం ఆయనకి ఎపండిసైటిస్ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు వెంటనే ఆపరేషన్ చేసారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని కొద్ది రోజుల విశ్రాంతి అవసరమని ఆసుపత్రి వర్గాలు మీడియా ప్రతినిధులకు తెలియచేశారు. వేణు మాధవ్ త్వరగా కొలుకోవాలని దట్స్ తెలుగు తరపున ఆశిస్తూ ఆయన తిరిగి సినిమా లో కంటిన్య్వూ అయ్యి తన కామెడి, మిమిక్రితో ప్రేక్షకులకు మరింత ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలిని ఆశిస్తాం.
వేణుమాధవ్ డాన్ శీను రవితేజ శక్తి జూ ఎన్టీఆర్ కొత్తపేట venu madhav don seenu ravi teja shakti jr ntr kothapeta


Click it and Unblock the Notifications