వాళ్ళకోసమే గుండు కొట్టించుకున్నా, కాలుమీద కాలు ఏంటన్నారు: వేణుమాధవ్
Recommended Video

టాలీవుడ్ లో కమేడియన్ వేణూ మాధవ్ కి ఉన్న ప్రత్యేకత వేరు. కామెడీలో తనదైన టైమింగ్ .. బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రత్యేకమైన మేనరిజంతో గిలిగింతలు పెట్టే వేణుమాధవ్, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. తన లైఫ్ లో ఎదురైన కొన్ని విచిత్రమైన అనుభవాలని ఇలా చెప్పాడు.

నిజమా లేక రూమరా
ఆ సమయం లో వేణూ మాధవ్ గుండుతో కనిపించటం తో చిరు మీద అభిమానంతోనే రీ ఎంట్రీగా వస్తున్న ఇనిమా హిట్ అవ్వాలని మొక్కు తీర్చుకొచ్చాడని చాలామంది చెప్పుకున్నారు. వెబ్సైట్లలో కూడా ఈ వార్త చాలా పాపులర్ అయ్యింది. అయితే అదై నిజమా లేక రూమరా అన్నది మాత్రం అర్థం కాలేదు.

గుండు నిజమే
ఈ ప్రశ్నకి సమాధానంగా చిరూ సినిమా కోసం తాను గుండు కొట్టించుకున్న మాట నిజమేననీ, బాలకృష్ణ 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం కూమా తిరుపతిలో గుండు కొట్టించుకున్నాననీ చెప్పాడు. "చిరూ 150 వ సినిమా కోసం .. బాలకృష్ణ 100వ సినిమా కోసం నేను 'గుండు' చేయించుకున్నాను.

వాళ్లిద్దరంటే చాలా ఇష్టం
వాళ్లిద్దరంటే నాకు చాలా ఇష్టం .. ఇద్దరితోను మంచి అనుబంధం వుంది. ఒక సినిమాకి వినాయక్ దర్శకుడైతే .. మరో సినిమాకి దర్శకుడు క్రిష్. వాళ్లిద్దరూ నాకు మంచి మిత్రులే. నటుడిగా నా రేంజ్ పెరిగేలా చేసింది వినాయక్ .. క్రిష్ తోను ఎంతో సాన్నిహిత్యం వుంది. అందువలన ఈ సినిమాలు హిట్ కావాలని అలా చేశానే తప్ప .. వాళ్లను కాకా పట్టడం కోసం కాదు" అంటూ చెప్పుకొచ్చారు.

నేను ప్రూవ్ చేస్తాను
ఒక సినిమా షూటింగులో తనకి ఎదురైన ఒక అనుభవాన్ని గురించి చెప్పుకొచ్చారు. " నేను ఒక సినిమా షూటింగుకి వెళ్లినప్పుడు ఆ సినిమా చేస్తోన్న ఓ పెద్ద హీరో నన్ను పిలిచారు. "ఏవయ్యా నువ్ కాలు మీద కాలేస్తావట గదా?" అని అడిగారు. "ఎవరు చెప్పారు మీకు ఆ విషయం" అని అడిగాను. "నేను ప్రూవ్ చేస్తాను ఆ విషయం" అంటూ ఎవరికో ఫోన్ చేస్తున్నారు.

ఎవరి కాలుమీద కాలేసి కూర్చోను
ఆయనను అడ్డుకుంటూ "విషయమేంటో స్పష్టంగా చెప్పండి సార్" అన్నాను. "నువ్ కాలుమీద కాలేసుకుని కూర్చుంటావట గదా!" అన్నారు. " నేను ఎవరి కాలుమీద కాలేసి కూర్చోను సార్ .. నా కాలుమీద నా కాలేసుకుని కూర్చుంటాను .. అది తప్పెలా అవుతుంది సార్?" అన్నాను.

నువ్ మాట్లాడేది కరెక్ట్ కాదయ్యా
దాంతో రెండు నిమిషాల పాటు ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. ఆ తరువాత "నువ్ మాట్లాడేది కరెక్ట్ కాదయ్యా .. సరే నీ ఇష్టం అలాగే కానీ " అన్నారు. "ఏం చేస్తాం .. అది నా అలవాటు .. ఆ తరువాత కూడా ఆ హీరోతో సినిమాలు చేశాను" అంటూ వేణుమాధవ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











