»   » బన్నీ అందరికి చెప్పేశాడు, హ్యాట్సాఫ్..అది చాలా చిన్నది!

బన్నీ అందరికి చెప్పేశాడు, హ్యాట్సాఫ్..అది చాలా చిన్నది!

Subscribe to Filmibeat Telugu

జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వేణు ప్రస్తుతం కమెడియన్ గా రాణిస్తున్నాడు. తెలంగాణ యాసలో వేణు చేసే కామెడీ అందరిని మెప్పిస్తుంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో వేణు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. రుద్రమ దేవి చిత్ర విషయంలో జరిగిన సంఘటనని గుర్తు చేసుకున్న వేణు బన్నీ గురించి మాట్లాడాడు. రుద్రమ దేవి చిత్ర విషయంలో తాను చేసిన చిన్న సాయం గురించి బన్నీ ప్రతి సందర్భంలో అందరికి వివరించారని వేణు తెలిపాడు.

జబర్దస్త్ కమెడియన్ గా ప్రయాణం

జబర్దస్త్ కమెడియన్ గా ప్రయాణం

జబర్దస్త్ కమెడియన్ గా ప్రయాణం మొదలు పెట్టిన వేణు ప్రస్తుతం మంచి అవకాశాలని అందుకుంటున్నాడు. వేణు కామెడీ టైమింగ్ చాలా బావుంటుందని ఒపీనియన్ అందరిలో ఉంది.

 రుద్రమ దేవి చిత్రంలో బన్నీకి సాయం

రుద్రమ దేవి చిత్రంలో బన్నీకి సాయం

కమెడియన్ వేణు రుద్రమ దేవి చిత్ర విషయంలో అల్లు అర్జున్ కు సహాయ పడ్డాడు. ఆ చిత్రాల్లో బన్నీ గోనగన్నారెడ్డిగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ మెప్పించిన సంగతి తెలిసిందే.

 ఆ పాత్రే హైలైట్

ఆ పాత్రే హైలైట్

రుద్రమ దేవి చిత్రంలో అల్లు అర్జున్ పోషించిన గోనగన్నారెడ్డి పాత్ర హైలైట్ గా నిలిచింది. బన్నీ పాత్ర ఉన్నత సేపు సినిమా చాలా హుషారుగా సాగుతుంది.

ఆయనతో అల్లు అర్జున్ వద్దకు

ఆయనతో అల్లు అర్జున్ వద్దకు

రుద్రమ దేవి చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్రని రాజహంస రాశారు. నేను తెలంగాణ యాసలో బాగా మాట్లాడుతానని ఆయనకు తెలుసు. దీనితో బన్నీ వద్దకు నన్ను కూడా తీసుకుని వెళ్లారు.

ఆ కిటుకు వేణుదే

ఆ కిటుకు వేణుదే

గోనగన్నారెడ్డి పాత్ర విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంలో నేనొక ప్రతిపాదన చేశాను. బన్నీ యాస ఎలా ఉండాలో చెప్పింది నేనే. ఆ చిన్న సాయాన్ని అల్లు అర్జున్ ఇంత వరకు మరచిపోలేదని వేణు తెలిపాడు.

 అందరికి చెప్పేశాడు

అందరికి చెప్పేశాడు

తాను చేసిన సాయం గురించి బన్నీ ప్రతి వేదికపైన అందరికి చెప్పేశాడు. తాను చేసింది చిన్న సాయమే. బన్నీ అంతటి వాడు నా గురించి చెప్పడంతో సంతోషం వేసిందని వేణు తెలిపాడు. నాకు అంతటి ప్రాముఖ్యత దక్కేలా చేసిన బన్నీకి హ్యాట్సాఫ్ అని వేణు ప్రశంసలు కురిపించాడు.

English summary
Comedian Venu talks about Allu Arjun. Venu reveals secret behind Gona Ganna reddy role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu