ఆ సంఘటన తర్వాతే ఆత్మహత్య, కారణం అమె: నటుడు విజయ్ సాయి తల్లి స్టేట్మెంట్
Recommended Video

తెలుగు నటుడు విజయ్ సాయి ఆత్మహత్య సంఘటన సినిమా ఇండస్ట్రీల్లో విషాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన వెనక కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. కేవలం అవకాశాలు లేక పోవడం కారణం కాదని, కుటుంబ కలహాలు అతడిని ఆత్మహత్య చేసుకునేలా చేశాయని తెలుస్తోంది.

నా కొడుకు చావుకు కారణం కోడలే
తన కొడుకు చావుకు కారణం కోడలు వనిత అని విజయ్ సాయి తల్లి మీడియాకు వెల్లడించారు. మూడు సంవత్సరాలుగా ఇద్దరూ విడిగానే ఉంటున్నారని, ఆమె చేస్తున్న పనుల వల్లే తన కొడుకు మనోవేధనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె తెలిపారు.

నగలు, డబ్బు అన్నీ తీసుకెళ్లింది
తమ ఇంటి నుండి నగలు, డబ్బు, ఖరీదైన చీరలు అన్ని కోడలు తీసుకెళ్లిందని, అయినా తాము ఏనాడు ఆమెను ఏమీ అనలేదని విజయ్ సాయి తల్లి మీడియాకు వెల్లడించారు.

మమ్మల్ని బజారుకు లాగింది
తాము ఇన్నాళ్లు ఎలాంటి మాట పడకుండా జీవిస్తున్నామని, కానీ తన కోడలు తమను బజారుకు లాగిందని విజయ్ తల్లి మీడియాకు వెల్లడించారు. ఆమె కారణంగా తన కొడుకు విజయ్ సాయి చాలా కుమిలిపోయేవాడని తెలిపారు.

రెండు రోజుల క్రితం ఆ సంఘటన తర్వాత...
రెండు రోజుల క్రితం లాయర్, మెకానిక్‌తో తన కోడలు ఇక్కడికి వచ్చిందని, కారు కూడా తీసుకెళ్లిందని విజయ్ తల్లి తెలిపారు. తన కొడుకు బయటకు వెళ్లి వచ్చి కారు ఏమైందని అడగటంతో జరిగిన విషయం చెప్పానని, అప్పటి నుండి మరింత కుమిలిపోయేవాడని ఆమె తెలిపారు.

బాధ పడుతూ సినిమాలు ఎలా చేస్తాడు
తన భార్య చేసిన పనులకు విజయ్ సాయి తరచూ బాధ పడుతుండేవాడని, ఇలా అయితే ఎలా అని మేము ఎంతో నచ్చజెప్పామని, ఆ బాధతోనే సినిమాలు కూడా సరిగా చేయడం లేదని విజయ్ తల్లి మీడియాకు తెలిపారు.


Click it and Unblock the Notifications











