గాయాలతో హాస్పిటల్ పాలైన కమెడియన్ హర్ష.. అసలు కథ ఏంటంటే?
వైవా హర్ష యూట్యూబ్ నుంచి వెండితెరకు పరిచయమైన ఓ మంచి కమెడియన్. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన వైవా ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద ఫుల్ డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. కమెడియన్‌గానే కాకుండా ఎమోషనల్ సీన్స్‌లోనూ నటిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా వైవా హర్ష సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దాన్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటో ఓ సారి చూద్దాం.

అలా ఫేమస్..
యూట్యూబ్‌లో వచ్చిన వైవా అనే షార్ట్ ఫిల్మ్‌తో హర్ష ఫేమస్ అయ్యాడు. అందులో హర్ష ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, ఫ్రస్ట్రేషన్ క్యారెక్టర్ చేసిన నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ షార్ట్ ఫిల్మ్‌ను చూసి బ్రహ్మానందం అంతటి వారే మెచ్చుకున్నాడు. అలా అక్కడి నుంచి వెండితెరకు ప్రయాణం సాగించాడు.

కమెడియన్‌గా ఆఫర్లు..
అయితే వైవా హర్షను ఓ కమెడియన్‌గా గుర్తు పెట్టుకుంటున్నారు.మేకర్స్ కూడా తమ సినిమాల్లో కమెడియన్ రోల్స్ ఇస్తూ వచ్చారు. మొదటిసారిగా హర్ష నవ్విస్తూనే ఏడిపించేశాడు. కలర్ ఫోటో సినిమాలో హర్ష ఎంతగా నవ్వించాడో.. అంతగా ఏడిపించేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో హర్ష జీవించేగలడని నిరూపించుకున్నాడు.

నిశ్చితార్థం..
వైవా హర్ష ఈ ఏడాది వివాహా బంధంతో కొత్త జీవితాన్ని ఆరంభించనున్నాడు. ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. జనవరిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హర్ష నిశ్చితార్థ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. అయితే సమ్మర్‌లో హర్ష వివాహాం చేసుకోబోతన్నట్టు తెలుస్తోంది.

ఇప్పుడు ఇలా..
అయితే తాజాగా హర్ష ఓ ఫోటోను షేర్ చేశాడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హర్ష.. బైక్ రైడింగ్‌లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటాడు. ఏదో ప్రమాదం జరిగి హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నట్టుగా ఓ ఫోటోను షేర్ చేశాడు. ఒక్కసారిగా ఆ ఫోటోను చూసి అతనికి ఏమైందా? అని నెటిజన్లు కంగారు పడ్డారు.

షూటింగ్ కోసం..
హర్ష ఇప్పుడు సుమంత్ హీరోగావస్తోన్న అనగనగా ఓ రౌడీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ షూటింగ్ కోసం ఇలా మేకప్ వేసుకుని రెడీ అయి అలా హాస్పిటల్‌లో ఉన్నాడు. ఫోటో చూసి కంగారు పడిన నెటిజన్లు ఆయన పెట్టిన క్యాప్షన్ చూసి కూల్ అయ్యారు. సినిమా షూటింగ్ కోసం ఇలా గాయాలైనట్టుగా నటిస్తున్నట్టు తెలిసేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications











