For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇది నిజం... నవ్విస్తేనే డబ్బులు ఇస్తాం (ఫొటో పీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ట్రెండ్ మారింది అని సినిమా వాళ్లు రెగ్యులర్ గా అంటూంటారు. అది నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ చూస్తుంటే. శ్రీను వైట్ల, త్రివిక్రమ్ వచ్చిన తర్వాత పెద్ద హీరోలు సైతం కామెడీని తమ సినిమాల్లో ప్రధాన భాగంగా చేసుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో వినోదం గ్యారెంటిగా ఉంటోంది.

  ఇదేం సినిమారా బాబోయ్‌... గుండెలు పిండేశాడు... రుమాలు తడిసిపోయింది. మరీ సెంటిమెంట్‌ ఎక్కువైపోయింది అంటుంటారు. అయితే మన తెలుగు సినిమాల్లో బంధాలు, అనుబంధాలు, భావోద్వేగ సన్నివేశాలకు స్థానం లేదా? అలాంటి సినిమాలు వస్తే ఇక్కడ నిలవవా? అంటే కాదనే చెప్పాలి.

  ఎందుకంటే ఇటీవల విజయాలు సాధించిన సినిమాలు చూస్తే కుటుంబ సంబంధాల్ని పండించారు. వాటిలోనూ గుండెలు పిండేసే సన్నివేశాలు ఉన్నాయి. కానీ ఎందుకు ప్రేక్షకులకు నచ్చాయంటే చెప్పేదాన్ని సరైన రీతిలో తేలికగా నవ్వులతో మేళవించి చెప్పడమే అని చెప్పుకోవాలి.

  సినిమా పతాక సన్నివేశాల్లో బరువైన సందేశమున్నా, సెంటిమెంట్‌ సన్నివేశాలు ఉన్నా సినిమా మొదటి నుంచి నవ్వించగలగాలి. ప్రేక్షకుల నాడిని పట్టిన కొందరు దర్శకులు మొదటి వంద నిమిషాలు నవ్విస్తూ పతాక సన్నివేశాల్లో అసలు విషయాల్ని కాస్త భావోద్వేగంతో చెప్తున్నారు.

  స్లైడ్ షోలో...ఈ మధ్య వచ్చిన కామెడీ హిట్ లు...రాబోతున్న సినిమాలు

   'అత్తారింటికి దారేది'

  'అత్తారింటికి దారేది'

  టైటిల్ తగ్గట్లు 'అత్తారింటికి దారేది' అంటూ ప్రేక్షకులు సినిమా థియేటర్ల దారిని వెతుక్కున్నారంటే దానికి కారణం కావలసినంత వినోదంతో పాటు, ఆఖరులో అత్త కోసం ఓ మేనల్లుడు పడే ఆరాటం నచ్చే కదా. పతాక సన్నివేశాల్లో పాత్రలు పలికే ప్రతి సంభాషణ కుటుంబ సంబంధాల్ని చూపిస్తుంది.

  'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'

  'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'

  ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ ప్రారంభం నుంచి నవ్వించాడు. చివరికొచ్చేసరికి తండ్రిని ఎదిరించి మాట్లాడాడు. ఇలాంటి వాళ్లు సమాజంలో చాలా మంది ఉంటారు. అయితే దీన్నే విషయంగా మొదటి నుంచి చెప్తే చూడలేరు. ''నవ్విస్తూ చెప్తే ప్రేక్షకులు ఎంతటి భారీ భావోద్వేగాలున్న సన్నివేశాల్నైనా చూస్తారు, ఆదరిస్తారు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' తండ్రీకొడుకుల మధ్య బంధాన్ని అందరికీ వినోదాన్ని అందిస్తూ చూపించింది'' అంటారు సందీప్‌కిషన్‌.

   'ఉయ్యాలా జంపాలా'

  'ఉయ్యాలా జంపాలా'

  బావామరదళ్ల గిల్లికజ్జాలతో ఇప్పటివరకు మనకు చాలా సినిమాలొచ్చాయి. అయినా ఇటీవల వచ్చిన 'ఉయ్యాలా జంపాలా' చూస్తే పాతకథనే కొత్తగా ఎలా చూపించాలో తెలుస్తుంది. నవ్వుల మసాలా దట్టించి బావామరదళ్ల ప్రేమను చూపించారు.

   'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'

  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'

  ఈ చిత్రం విషయానికొస్తే మరో కొత్త విషయం తెలుస్తుంది. అన్నదమ్ముల మధ్య సంఘర్షణని ఆహ్లాదంగా చూపించారు శ్రీకాంత్‌ అడ్డాల. తొలిభాగంలో వారి మధ్య ఏర్పడ్డ మనస్పర్థలు, వాటిని ప్రకాష్‌రాజ్‌ తీర్చిన వైనాన్ని చూపిస్తూ... అక్కడక్కడ నవ్వులు పూయిస్తూ పకడ్బందీగా తీర్చిదిద్దారు.

   బలుపు

  బలుపు

  రవితేజ నటించిన 'బలుపు'లో ప్రియురాలి మాట కోసం ప్రియుడు పడ్డ కష్టం చూపించారు. అయితే అదే సమయంలో బ్రహ్మీ, రవితేజ మధ్య కామెడీని బాగా పండించి విజయానికి దారి వేసాడు దర్సకుడు

  'గుండెజారి గల్లంతయ్యిందే'

  'గుండెజారి గల్లంతయ్యిందే'

  ఈ చిత్రంలో ఒకర్నొకరు చూసుకోకుండానే చేసే స్నేహం పర్యవసానాలను కళ్లకు కట్టారు. అదే సమయంలో కామెడీకి సినిమాలో పెద్ద పీట వేసారు

  'తడాఖా'

  'తడాఖా'

  ఈ చిత్రంలో అన్నదమ్ముల మధ్య అనుబంధానికి కొత్త రూపం కనిపిస్తుంది. ఇలా ఇవన్నీ భావోద్వేగాలను నవ్విస్తూ చూపించినవే.

  రేసు గుర్రం

  రేసు గుర్రం

  ఈ చిత్రంలో అల్లు అర్జున్ కన్నా ఎక్కువ మార్కులు...కిల్ బిల్ పాండే గా చేసిన బ్రహ్మీకే పడ్డాయన్న సంగతి మర్చిపోకూడదు. సినిమా చివర్లో వచ్చి అదరకొట్టి, కలెక్షన్స్ రికార్డులు బ్రద్దలు కొట్టాడు

   ఊహలు గుసగుసలాడే

  ఊహలు గుసగుసలాడే

  ఈ మధ్యకాలంలో సున్నితమైన హాస్యంతో వచ్చిన ఈ చిత్రంలో ఫన్నీ డైలాగులకు మంచి మార్కులే పడ్డాయి. ఆ డైలాగులే లేకపోతే సినిమాకి ఆ టాక్ వచ్చేది కాదనేది నిర్విదాంశం.

   మనం

  మనం

  అక్కినేని కుటుంబ కధా చిత్రంగా వచ్చిన ఈ చిత్రంలో భావోద్వేగాలకు ఎంత ప్రయారిటీ ఇచ్చారో అదే సమయంలో దర్శకుడు సున్నితమైన హాస్యానికి కూడా చోటిచ్చారు.

   హృదయ కాలేయం

  హృదయ కాలేయం

  ఎవరో కొత్తకుర్రాడు, ఇంటర్ నెట్ లో పేరుతెచ్చుకున్న హీరోకు ...వసూళ్లు,, క్రేజ్ దక్కాయంటే తీసుకున్న సబ్జెక్టులో పండించిన హాస్యమే

  పాండవులు పాండవులు తుమ్మెద

  పాండవులు పాండవులు తుమ్మెద

  మోహన్ బాబు కుటుంబం అంతా కలిసి చేసిన ఈ చిత్రంలో హాస్యానికే పట్టాభిషేకం చేసారు. సెకండాఫ్ మొత్తం కామెడీతో నింపి విజయం సాధించారు.

   అంజలి

  అంజలి

  త్వరలో విడుదల కాబోతున్న అంజలి చిత్రం హర్రర్ కామెడీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కామెడీ ఉందని ప్రత్యేకంగా పబ్లిసిటీ చేసి ప్రోమోలు వదలుతున్నారు. కామెడీనే జనాలను థియోటర్స్ కి తీసుకువస్తుందని నమ్ముతున్నారు.

   అల్లుడు శ్రీను

  అల్లుడు శ్రీను

  ఈ వారంలో విడుదల కాబోతున్న వివి వినాయిక్ చిత్రం అల్లుడు శ్రీను లో సైతం బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ ల మద్య వచ్చే సన్నివేశాలే హైలెట్ అంటున్నారు. మా చిత్రంలో హాస్టానికి ప్రధాన స్ధానం ఇచ్చామని చెప్తున్నారు.

   పండుగ చేస్కో

  పండుగ చేస్కో

  రామ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో సైతం బ్రహ్మానందంపై పూర్తి స్దాయిలో కామెడీ ట్రాక్ ఉందని చెప్తున్నారు. ఫన్ ఈ చిత్రాన్ని నిలబెడుతుందని భావిస్తున్నారు.

  English summary
  It showed the whole telugu cinema about how a good comedy drama punch can take over the whole of the industry in just one clean sweep.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X